twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మానవత్వం చాటుకొన్న ఎంజెలీనా జోలీ.. కరోనా బాధితులకు 7.5 కోట్ల విరాళం

    |

    హాలీవుడ్ అందాల తార ఎంజెలీనా జోలీ అంటే కేవలం నటియే కాదు.. మానవత్వానికి ప్రతీక. ఆపద సమయాల్లో ఎన్నోమార్లు విరాళాలతో ఆదుకొన్న మానవతామూర్తి అని హాలీవుడ్‌ మీడియా కోడైకూసింది. తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ ముప్పు సమయంలో ఎంజెలీనా జోలీ మానవతా హృదయం మరోసారి స్పందించింది. ఈ ముప్పు సమయంలో ఆకలితో అలమటించే పిల్లల కోసం భారీ విరాళాన్ని అందించింది. తాజాగా ఆమె ఇచ్చిన విరాళం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

    100 కోట్ల చిన్నారులు ఆకలితో

    100 కోట్ల చిన్నారులు ఆకలితో

    ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితులపై ఎంజెలీనా జోలీ స్పందిస్తూ.. ఈ వారం రోజుల్లో 100 కోట్లకు మందికిపైగా చిన్నారులు రోడ్డున పడ్డారు. ఈ పరిస్థితుల్లో వారికి సంరక్షణ, పుష్టికరమైన ఆహారం కావాల్సి ఉంది. కేవలం అమెరికాలోనే 2 కోట్లకుపైగా చిన్నారులకు సరైనా ఆహారం అందించాల్సిన అవసరం ఏర్పడింది అని ఎంజెలీనా చెప్పారు.

    పుష్టికరమైన ఆహారాన్ని అందిందుకు

    పుష్టికరమైన ఆహారాన్ని అందిందుకు

    కరోనావైరస్ సృష్టించిన భయంకరమైన పరిస్థితుల నుంచి చిన్నారులను కాపాడేందుకు బిల్లీ షోర్ నిర్వహిస్తున్న No Kid Hungry అనే సంస్థ విశేషమైన కృషి చేస్తున్నది. చాలామంది చిన్నారులకు సరైన సంరక్షణ, పుష్టికరమైన ఆహారాన్ని అందించే చర్యలు తీసుకొంటున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సంస్థను ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఎంజెలీనా ఓ ప్రకటనలో తెలిపారు.

    7.5 కోట్ల విరాళం

    7.5 కోట్ల విరాళం

    ప్రపంచవాప్తంగా కొవిడ్19 వైరస్ బారిన పడిన చిన్నారులను ఆదుకోవాలనే ప్రయత్నాల్లో భాగంగా ఆర్థిక సహాయం అందించాలనే నిర్ణయం తీసుకొన్నాం. అందుకోసం నా వంతుగా 1 మిలియన్ డాలర్ మొత్తాన్ని (సుమారు 7.5 కోట్ల రూపాయలు) ఆర్థిక సహాయం ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నాను. నా వంతుగా No Kid Hungry ద్వారా చిన్నారులకు సహాయం అందించాలనుకొంటున్నాను అని ఎంజెలీనా తెలిపారు.

     హాలీవుడ్ ప్రముఖుల భారీ విరాళం

    హాలీవుడ్ ప్రముఖుల భారీ విరాళం

    అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న దారుణ పరిస్థితులపై పలువురు హాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. తాజాగా క్లారా లియోనెల్ ఫౌండేషన్‌కు సింగర్ రిహాన్నా 5 మిలియన్ల డాలర్లను, నటుడు ఆర్నాల్డ్ స్వార్జ్‌నెగర్ 1 మిలియన్ డాలర్లు, ర్యాన్ రేనాల్డ్, బ్లేక్ లైవ్లీ ఇక మిలియన్ డాలర్ మొత్తాన్ని పలు స్వచ్ఛంద సంస్థలకు అందించారు.

    English summary
    Hollywood actress Angelina Jolie shows humanity once again. He donates 1 million dollars for Corona Cause, Who children are suffering for food. She donates sum to No Kid Hungry trust.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X