twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Angelina Jolie మాజీ భర్తపై ఎంజెలీనా జోలీ కేసు.. 250 మిలియన్ డాలర్లు కోసం దావా!

    |

    హాలీవుడ్ సినీ ప్రముఖులు బ్రాడ్ పిట్, ఎంజెలీనా జోలి కోర్టు వివాదాలు రంజుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే విడాకుల, పిల్లల సంరక్షణ కేసు విషయంలో విచారణ జరుగుతుండగా బ్రాడ్ పిట్‌పై ఆయన మాజీ భార్య ఎంజెలినా జోలి భారీ మొత్తంలో కేసు నమోదు చేశారు. వీరిద్దరు కలిసి స్థాపించిన ఫ్రెంచ్ వైనరీ విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో తన మాజీ భర్తపై 250 అమెరికన్ మిలియన్ల డాలర్లు చెల్లించాలంటూ కోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది.

    హాలీవుడ్ మీడియా కథనం ప్రకారం.. బ్రాడ్‌ ఫిట్ స్వాధీనంలో ఉన్న వైనరీ కంపెనీపై తనకు హక్కులు ప్రసాదించాలని కేసు నమోదు చేసింది. దక్షిణ ఫ్రాన్స్‌లో 2008 సంవత్సరంలో వారిద్దరూ 1300 ఎకరాల్లోని ఎస్టేట్‌ను కొనుగోలు చేశారు. వారిద్దరు కలిసి 10 మిలియన్ డాలర్లను దానిపై ఖర్చు చేశారు. ఆ ఎస్టేట్‌ అభివృద్దికి పాల్పడ్డారు. ఆ తర్వాత వారిద్దరూ విడాకులు తీసుకోవడంతో ఈ ఫ్రెంచ్ వైనరీ సంస్థ విషయంలో వివాదం తలెత్తింది. బ్రాడ్ పిట్, ఆయన బృందం ఈ సంస్థను ఆధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు అనే కథనాలు వచ్చాయి.

    Angelina Jolie files USD 250 million lawsuit on Brad Pitt over French winery

    విడాకుల విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంజెలీనాపై ప్రతీకారం తీర్చుకొనేందుకు బ్రాడ్ పిట్ ప్రయత్నిస్తున్నారు. ఎంజెలీనా వాటాకు వచ్చే సొమ్ము, ఆదాయాన్ని వాడుకొంటన్నాడు. ఆమెను ఒక ఒప్పందంపై సంతకం చేయాలని బలవంతం చేస్తున్నాడు అని ఎంజెలీనా తరఫు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

    మంగళవారం రోజున దాఖలైన పిటిషన్‌లో తన వాటాను తనకు ఇప్పించండి అంటూ కోరారు. ఈ ఫ్రెంచ్ వైనరీలోని కొంత మొత్తాన్ని ప్రముఖ కంపెనీకి అమ్మారు. విడాకుల తర్వాత ఆమెను సంప్రదించకుండా బ్రాడ్ పిట్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొంటున్నారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

    English summary
    Actress Angelina Jolie files USD 250 million lawusit on Brad Pitt. As per Page Six, The lawsuit has been filed by Nouvel, the company that Jolie had founded to retain her stake in the French winery
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X