ప్రాణాలకు తెగించి సాహసాలు చేస్తున్న ఏంజలీనా జోలీ..!!
హాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఎంజలీనా జోలీ సిఐఎ(CIA) ఏంజెంట్ గా నటిస్తోన్న చిత్రం 'సాల్ట్'. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు నిరవదికంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఇందులో ఏంజలీనా ఎంతో ధైర్ఘం చేసి ప్రమాదకరమయిన సాహసాలను చేస్తోందట. ఏంజలీనా అంటే వెంటనే గుర్తొచ్చే టాంబ్ రైడర్ సినిమాలోని సాహసాలకు మించి ఇందులో ఆమె సాహసాలు వుంటాయని దర్శకనిర్మాతలు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే CIA ఏజెంట్ గా పనిచేస్తోన్న ఏంజలీనా జోలీ ని రష్యాకు చెందిన గూఢచారిగా అనుమానించి అంతం చెయ్యాలని ప్రయత్నిస్తారు. ఆ తర్వాత ఆమె ఎలా వారి బారి నుండీ తనని తాను రక్షించుకొంటూ, తన నిజాయితీని నిరూపించుకుంది అనేది మిగిలిన కథ. కాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, ట్రెయిలర్ లకు మంచి స్పందన వచ్చింది. ఇందులో జోలీ సాల్ట్ మరియు ఏంజీ అనే రెండు గెటప్ లలో కనిపిస్తుంది. ట్రెయిలర్లు చూసిన వారికి ఇందులో జోలీ చేసే సాహసకృత్యాలు ఎలా వుండబోతున్నాయో తెలుస్తుంది.
కొలంబియా పిక్చర్స్ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రం వచ్చే వేసవిలో ప్రేక్షకులముందుక రానుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు: whoissalt.com లో చూడచ్చు.


Click it and Unblock the Notifications











