జోలీకి ఎంగేజ్‌మెంట్ రింగ్ నచ్చక పోవడానికి కారణం..?
లాస్ ఏంజిల్స్: గత ఏడు సంవత్సరాలుగా కలిసి జీవిస్తున్న హాలీవుడ్ సూపర్ స్టార్స్ బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీలు ఈ సమ్మర్‌లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. బ్రాడ్ పిట్, జోలీతో తన ప్రేమను తెలియజేసేందుకు గాను 2.50 లక్షల డాలర్ల విలువైన వజ్రపుటుంగరం చేయించి ఎంగేజ్ మెంట్ రోజున జోలీ చేతికి తొడగడం జరిగింది. హాలీవుడ్లో సంచరిస్తున్న వార్తల ప్రకారం జోలీకి ఈ ఎంగేజ్ మెంట్ రింగ్ నచ్చలేదని సమాచారం.
వివరాల్లోకి వెళితే గతంలో ఎప్పుడూ ఏంజిలీనా జోలీ తెలుపు వజ్రాలు కలిగిన ఉంగరాన్ని ధరించక పోవడమే. ఐతే బ్రాడ్ ఎంతో ముచ్చట పడి ఈ ఉంగరాన్ని చేయించడంతో ఉంగరం యొక్క డిజైన్‌కి ఆమె వ్యతిరేకంగా లేరు. ఏంజిలీనా జోలీకి పచ్చరంగు వజ్రాలంటే చాలా ఇష్టం. అంతేకాకుండా పచ్చ రంగు వజ్రం జోలీ ప్రేమను పిట్‌కు ఎలా తెలిసిందో కొంచం చూపిస్తుంది. ప్రస్తుతం బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీ అరుగురు పిల్లలకు తల్లి దండ్రులుగా వ్యవహారిస్తున్నారు. ఈ ఆరుగురిలో ముగ్గరికి జన్మనివ్వగా.. మిగిలిన వారిని దత్తతు తీసుకున్నారు.
ఇటీవలే వారి నిశ్చితార్థం అయినట్లు అధికారకంగా వెల్లడైంది. పెళ్లి కోసం బ్రాడ్ 2.50 లక్షల డాలర్ల విలువైన వజ్రపుటుంగరం చేయించినట్లు బెవర్లీ హిల్స్ జ్యూయలర్ రాబర్ట్ ప్రొకాప్ వెల్లడించారు. అనంతరం పిట్ అధికార ప్రతినిధి సింతియా పెట్-దంతే ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. 'అవును అది నిజమే. భవిష్యత్తుకు భరోసా కల్పించే ఈ నిర్ణయం పట్ల వారి పిల్లలంతా చాలా ఆనందంగా ఉన్నారు.
ప్రస్తుతానికి వారి పెళ్లి తేదీ ఇంకా ఖరారు కాలేదు' అని ఆమె తెలిపారు. చాలా నాణ్యమైన వజ్రంతో జూలీ చేతికి సరిపోయాలా చక్కని ఉంగరాన్ని తయారుచేసినట్లు ప్రొకాప్ వెల్లడించారు. లాస్‌ఏంజెల్స్ కౌంటీ మ్యూజియంలో ఇటీవల జరిగిన చైనీస్ ఆర్ట్ కలెక్షన్ కార్యక్రమంలో తొలిసారిగా జోలీ ఆ ఉంగరంతో కనిపించారు.


Click it and Unblock the Notifications











