ఆ జంట కాపురంలో అమెరికా అద్యక్షుడి చిచ్చు...!!
ప్రముఖ హాలీవుడ్ నటీమణి ఏంజెలీనా జోలి తనకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అంటె అంతులేనంత అసహ్యమని బహిరంగంగా ప్రకటిస్తోంది. ఇటీవల 'యుఎస్ వీక్లీ" అనే ఓ ప్రముఖ వారపత్రికకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. విద్య, పునరావాసం వంటి ముఖ్యాంశాలకు ఒబామా ప్రాముఖ్యతని ఇవ్వకుంటున్నందునే ఆయన పట్ల తాను వ్యతిరేకత పెంచుకోవాల్సి వస్తోందని జోలి వివరించింది. 2001 నుంచి ఐక్యరాజ్యసమితికి గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఏంజెలీనా ఇకనైనా ఒబామా తన వ్యవహార సరళిని మార్చుకుని సంక్షేమ కార్యక్రమాల పట్ల దృష్టి సారించాలని హితవు పలుకుతోంది.
ఇదే విషయమై ఏంజలీనా, బ్రాడ్ పిట్ ల మధ్య ఎప్పుడూ గొడవ జరుగుతూ వుంటుందని, ఈ విషయంలో ఏంజలీనా బ్రాడ్ పిట్ కు కనీస మర్యాద కూడా ఇవ్వదని వారి సన్నిహితులు చెబుతున్నారు. కానీ ఈ విషయం వారిద్దరినీ విడదీసేంతటి పెద్దదేమీ కాదని వారంటున్నారు.


Click it and Unblock the Notifications











