»   » కొత్త ప్రియుడితో ప్రముఖ నటి రహస్యంగా.. ఆగ్రహంతో ఊగిపోతున్న భర్త..

కొత్త ప్రియుడితో ప్రముఖ నటి రహస్యంగా.. ఆగ్రహంతో ఊగిపోతున్న భర్త..

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన భర్త, ప్రముఖ నటుడు బ్రాడ్ ప్రిట్‌కు దూరంగా ఉంటున్న ప్రముఖ నటి ఎంజెలీనా జోలి ప్రస్తుతం బ్రిటన్‌కు చెందిన సెలబ్రిటీతో అఫైర్ నడుపుతున్నట్టు వెలుగులోకి వచ్చింది. అతడిని ఎంజెలీనా రహస్యంగా కలుసుకోవడంపై బ్రాడ్ ప్రిట్‌ను తీవ్రంగా వేదనకు గురిచేస్తున్నట్టు సమాచారం. ఎంజెలీనా తీరుపై బ్రాడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు హాలీవుడ్ పత్రికలు వెల్లడించాయి.

తొమ్మిదినెలలుగా వేర్వేరుగా

తొమ్మిదినెలలుగా వేర్వేరుగా

ఏడు నెలల క్రితం బ్రాడ్ పిట్, ఎంజెలీనాలు విడిపోయారు అప్పటి నుంచి వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఇటీవల బ్రిటన్‌కు చెందిన ప్రముఖుడికి ఎంజెలీనా దగ్గరైనట్టు కథనాలు వచ్చాయి. తరచూ వారిద్దరూ రహస్యంగా కలుసుకొంటున్నట్టు తెలిసింది.

బ్రిటన్ సెలబ్రిటీతో అఫైర్

బ్రిటన్ సెలబ్రిటీతో అఫైర్

ఎంజెలీనా అఫైర్ కొనసాగిస్తున్న వ్యక్తి ప్రముఖ పారిశ్రామిక వేత్త, బ్రిటన్ ప్రభుత్వంతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. మంచి అందగాడు. సమాజంలో మంచి పలుకుబడి ఉన్నాయి అని హాలీవుడ్ లైఫ్ అనే మ్యాగజైన్ ఓ కథనాన్ని ప్రచురించింది.

తోడు కోరుకొంటున్న ఎంజెలీనా

తోడు కోరుకొంటున్న ఎంజెలీనా

బ్రాడ్ ప్రవర్తనతో విసిగిపోయిన ఎంజెలీనా ప్రస్తుతం తోడు కోరుకొంటున్నది. అందుకే అతడితో ఎంజెలీనా రిలేషన్ పెట్టుకొన్నది. తరుచుగా వారిద్దరూ సీక్రెట్‌గా కలుసుకొంటున్నారు. డిన్నర్లు, పార్టీల్లో జోరుగ పాల్గొంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో కనిపించడానికి అసలు ఇష్టపడటం లేదు. ప్రస్తుతం కొత్త ప్రియుడితో మంచిగా రొమాన్స్ జీవితాన్ని గడుపుతున్నది. ఈ నేపథ్యంలో త్వరగా బ్రాడ్ పిట్‌తో విడాకుల ప్రక్రియను ముగించాలనుకొంటున్నది.

కొత్త ప్రియుడితో విహారయాత్ర

కొత్త ప్రియుడితో విహారయాత్ర

ఇటీవల కొత్త ప్రియుడితో విహారయాత్రకు వెళ్లిన సమయంలో తన ఏడుగురు పిల్లల్ని చాలా సురక్షితమైన ప్రదేశంలో విడిచి వెళ్లినట్టు సమాచారం. కొద్దిరోజుల క్రితం లాస్ ఏంజెలెస్‌లో తన పిల్లల్ని కొత్త ప్రియుడికి ఎంజెలీనా పరిచయం చేసినట్టు తెలిసింది. 2016 సెప్టెంబర్‌లో బ్రాడ్ పిట్ నుంచి విడాకులు కోరుతూ ఎంజెలీనా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తొమ్మిదేళ్ల డేటింగ్ తర్వాత 2014లో ఎంజెలీనా, స్మిత్ పెళ్లి చేసుకొన్నారు.

English summary
Angelina Jolie has been secretly meeting, and is rumoured to be serious about ‘a handsome British man’ and her ex-husband Brad Pitt finds it ‘sickening and disheartening’. Jolie filed for divorce from Pitt in September 2016. In California, couples usually have to wait six months before divorce proceedings are finalised. They married in 2014.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu