'ఇంద్ర ధనస్సు' కల సాకారమయింది
ఇంద్రధనస్సులో ఏడు రంగులు లాగా తన కుటుంబంలో ఈ ఏడు మంది పిల్లలు వుండాలని ఆమె ఆశపడింది. ఏడు రంగులూ వేటికవే భిన్నంగా వున్నట్టు తన పిల్లలు కూడా ఒకరిలా మరొకరు వుండకూడదనుకొంది. అనుకోవడంమే కాదు అందుకోసం ఎన్నో దేశాలు తిరిగింది. ఎంతో మంది అనాధలను కలిసింది. వారి బాగోగులకై ఆ దేశ ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను ఆరా తీసింది. అంతే కాకుండా తన వంతు సాయం చేసింది. ఒక్కో దేశం నుండీ ఓ అనాధను దత్తతకు తీసుకొంది. ఇంతా చదివాకా ఆమె మరెవరో కాదు హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజలీనా జోలీ అని మీకు ఈ పాటికే అర్థమయివుంటుంది.
ఈ 34 ఏళ్ల నటి సరిగ్గా నాలుగేళ్ల క్రితం తన కుటుంబంలో ఇంద్రధనుస్సులో రంగుల్లాగా ఏడుగురు పిల్లలు వుండాలని, వారు భిన్నమైన మతాల వారై, భిన్న సాంప్రదాయాలకు చెందిన వారై వుండాలని చెప్పింది. ఇటీవలే ఏంజలీనా, బ్రాడ్ జంట సిరియా నుండీ ఓ బిడ్డను దత్తతకు తీసుకున్నారు. ఆ బిడ్డ అమ్మాయో లేక అబ్బాయో చెప్పడానికి వారు నిరాకరిస్తున్నారు. దీంతో ఏడుగురు పిల్లలు కావాలనుకున్న ఏంజలీనా కల నిజమయింది. ఏంజలీనా, బ్రాడ్ లకు ముగ్గురు పిల్లలు కాగా, ముగ్గురు అనాధలను వారు దత్తతకు తీసుకున్నారు. వారు కంబోడియా, ఇథియోపియా, వియాత్నాం దేశాలకు చెందిన వారు.


Click it and Unblock the Notifications











