ఆ క్యారెక్టర్ ఏంజలినా జోలి కోసమే.....!
ప్రస్తుతం హాలీవుడ్ అంతా ఏంజలినా జోలి చుట్టు తిరుగుతుంది. ఆమె నటించిన 'సాల్ట్' సినిమా హిట్ అవ్వడంతో తర్వాత నటించబోయే సినిమాని ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇటీవల కాలంలో ఏంజలినా జోలి 'బోస్నియా యుద్దం' జరిగిన ప్రదేశానికి వెళ్శినప్పుడు ఆస్తులకు దూరమై దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్న అక్కడి నిరాశ్రయులు పడుతున్న కష్టాలను, వారి తెగువను చూసి ఆమె చలించిపోయారు. నిరాశ్రయులకు చేయూతనివ్వడానికి తనవంతు సహాయాన్ని అందిస్తానని అన్నారు.
ఆ సమయంలో వారికి ఇచ్చిన మాటా కోసం వాళ్శ జీవిత చరిత్రల ఆదారంగా 'బోస్నియా వార్-సెట్ లవ్ స్టోరి' అనే చిత్రాన్ని తీస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా 'అన్ ఫర్ గివెన్' అనే చిత్రాన్ని తీస్తున్నట్టు ప్రకటించారు. ఈ రెండు చిత్రాలను జికె ఫిలింస్ వారు నిర్మంచనున్నారు. 'అన్ ఫర్ గివెన్' అనేది 2009 లో వచ్చినటువంటి బ్రిటిష్ మినిస్ట్రీరిస్ సిరిస్ లో భాగం.
ఈ సినిమా కధ ఒక అంతా ఒక ఆడమనిషి చుట్టూ తిరుగుతుందని చిత్ర దర్శకుడు వివరించారు. ఇద్దరు పోలీస్ ఆఫీసర్లును చంపి 15 సంవత్సరాలు జైలుశిక్ష అనుభవించి తిరిగి తమ ఇంటికి వచ్చి తన ఫ్యామిలి మెంబర్స్ తో ఎలా మెలిగిందనేది సారాంశం. ఒరిజినల్ గా ఈ రోల్ ని బ్రిటిష్ టెలివిజన్ హీరోయిన్ సురన్నే జోన్స్ పోషించారు.
ఈ సినిమా లో ఏంజలినా జోలి లో రోల్ బాగా 'హాట్ గా టఫ్' గా వుంటుందని ఆయన అన్నారు. ఎన్నో సంవత్సరాలనుండి సినిమాలు చేస్తున్న ఏంజలినా జోలికి ఇదోక మంచి కానుక. గ్యారంటీగా ఈ క్యారెక్టర్ ఏంజలినా జోలి జీవితంలో ఒక మైలు రాయిగా నిలచిపోతుందని ఆయన చెప్పారు. ఏదఎమైనా మన ఏంజలినా జోలికి అంతా మంచే జరగాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











