twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రెంచ్ భాషలో పట్టు సాధిస్తున్న సూపర్ స్టార్

    By Nageswara Rao
    |

    ఏంజిలీనా జోలీ ప్రపంచంలో ఉన్న గొప్ప నటులలో ఒకరు. మొన్నటి వరకు స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటిన జోలీ ఇప్పుడు 'ది ల్యాండ్ ఆఫ్ బ్లడ్ అండ్ హానీ' సినిమా ద్వారా తనలో ఉన్న దర్శకత్వ పటిమను బయటకు తీసుకువస్తున్నారు. ఇటీవల కాలంలో జోలీని ఆరుగురు పిల్లలకు తల్లిగా ఎలా రాణిస్తున్నారు అని ఓ ఇంటర్యూలో అడిగిన ప్రశ్నకు గాను 36 సంవత్సరాలు వయసు కలిగిన జోలీ తనదైన శైలిలో స్పందించారు.

    తన ఆరుగురు పిల్లల కోసం తాను ప్రెంచి భాషను నేర్చుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం నేను పిల్లలతో ప్రెంచ్‌లో మాట్లాడడం, వ్రాయడం లాంటివి చేస్తున్నానని అన్నారు. మా పిల్లలు అందరూ కూడా ప్రెంచ్‌ భాషని అవపోసనం పట్టారు. ఎప్పుడూ నేను కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. ఎప్పుడు కూడా నా మైండ్‌ని హాఫ్ చేసి ఉండను. దానికి ఎప్పుడు కూడా ఏదో ఒక పని అప్ప చెబుతుంటాను.

    నా జీవింతలో ప్రెంచ్ భాషను నేర్చుకోవాలనే తాపత్రయం రావడానికి గల కారణం, మా పిల్లలు ప్రెంచ్‌లో బాగా మాట్లాడడమేనని అన్నారు. ప్రస్తుతం మాకు ఆరుగురు పిల్లలు. మాడెక్స్(10), పాక్స్(8), జహారా(6), షైలో(6), నాక్స్(3), వివిన్నే(3). మా పిల్లలు గత కొంత కాలంగా నన్ను, బ్రాడ్ పిట్‌ని పెళ్లి చేసుకోమని కోరుతున్నారని అన్నారు. ఇక్కడ పాఠకులు గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే ప్రస్తుతం జోలీ ప్రెగ్నెంట్ అన్న వార్త హాలీవుడ్లో సంచరిస్తుంది.

    English summary
    Actress Angelina Jolie is learning French as all her six children can speak the language fluently.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X