ఆ విషయంలో నాకు స్పూర్తి ఏంజిలినా జోలి...!
ఏంజిలినా జోలి హాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన స్దానాన్ని ఏర్పరచుకున్నారు. అంతేకాకుండా ఏంజిలినా జోలి ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరిస్తారు, తాను ఐక్యరాజ్యసమితి బ్రాండ్ అంబాసిడర్ గా తన బాధ్యతలను చాలా చక్కగా నిర్వహిస్తున్నారు ఈ మాట అన్నది ఎవరో కాదు ఇవా మెండిస్. ఇలా వేరే వారిగురించి మంచిగా మాట్లాడడం వల్ల ఇవా మండిస్ ప్రవర్తనలోనేకాదు మనసుకూడా చాలా మంచిదని అనికుంటున్నారు ఏంజిలినా జోలి అభిమానులు. జనరల్ గా ఒకానోక స్టేజి కొచ్చిన తర్వాత ఒకరిగురించి మాట్లాడుకోవడం అనేది చాలా తక్కువ.
ఇటీవల కాలంలో ఇవా మెండిస్ మాట్లాడుతూ మంచి కారణాలకి పనిచేయడానికి ఏంజిలినా జోలి నన్ను బాగా ప్రేరేపించింది. ఏంజిలినా జోలి చేస్తున్న చారిటి వర్కు నాకు చాలా బాగా నచ్చింది. తన చారిటి వర్కు చాలా కూల్ గా పోతుందని అనుకుంటున్నాను. ఐక్యరాజ్యసమితి గుడ్ విల్ అంబాసిడర్ గా ఏంజిలినా జోలి చేస్తున్న పని ప్రశంశనీయం. జోలిని ప్రేరణగా తీసుకోని నేనుకూడా ఇటీవలే ఎల్సియమ్ పౌండేషన్ కి పండ్స్ వసూలు చేసే పనిలో పడ్డాను. అప్పుడప్పుడు ఇలాంటి చారిటి కార్యక్రమాలలో పోల్గోన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుందన్నారు.


Click it and Unblock the Notifications











