»   » నిజమే...: ఆ హీరోయిన్ నగ్న చిత్రాలు అమ్మకానికి!

నిజమే...: ఆ హీరోయిన్ నగ్న చిత్రాలు అమ్మకానికి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లండన్: హాలీవుడ్ సినిమాలపై అవగాహన ఉన్న వారికి ఏంజలీనా జోలీ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. పలు హాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల్లో నటించడం, హాట్ అండ్ సెక్సీ ఫోటో షూట్లతో ఆమె సినీ అభిమానులకు సుపరిచితమే. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.

తాగా ఏంజలీనా జోలికి సంబంధించిన నగ్న చిత్రాలు లండన్ లోని జీబ్రా వన్ గ్యాలరీలో అమ్మకానికి పెట్టారు. 20 ఏళ్ల వయసులో జోలీ మోడలింగ్ చేస్తున్న రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ న్యూడ్ ఫోటో షూట్ జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఒక్కోటి £1800(రూ. 1.8 లక్షలు) ధరకు విక్రయిస్తున్నారు.

ఏంజెలీనా జోలీ గతేడాది తన ప్రియుడు బ్రాండ్ పిట్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడెనిమిదేళ్లుగా సహజీవనం అనంతరం హాలీవుడ్ సెక్సీ జోడీ బ్రాడ్ పిట్, ఏంజలీనా జోలీ పెళ్లి చేసుకున్నారు. దంపతులయ్యారు. 2005 నుండి కలిసి సహజీవనం చేస్తున్న ఈ ఇద్దరూ 2012లో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫ్రాన్స్‌లో వీరి వివాహం జరిగింది.

Angelina Jolie nude photographs on sale in London

ఈ ఏడేళ్ల సహజీవనంలో ఈ జంట ముగ్గురు పిల్లలకు జన్మనివ్వగా...మరో ముగ్గురిని దత్తత తీసుకున్నారు. హాలీవుడ్ హాట్ జోడీ అయిన బ్రాడ్ పిట్, ఏంజలీనా జోలిలను కలిపి......ముద్దుగా 'బ్రాంజలీనా' అని పిలుచుకుంటారు అభిమానులు. మోస్ట్ రొమాంటిక్ కపుల్‌గా వీరు పేరు తెచ్చుకున్నారు.

2005లో వచ్చిన 'మిస్టర్ అండ్ మిస్టర్స్ స్మిత్' చిత్రంలో కలిసి నటించిన ఈ జోడీ ప్రేమలో పడి పోయాడు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ.....ఒకరి కోరికలను మరొరు ఆస్వాదిస్తూ చూడముచ్చటైన ప్రేమ జంటగా పేరు తెచ్చుకున్నారు.

English summary
Rare black and white photographs of a naked Angelina Jolie at aged 20 have gone on sale at London gallery.
Please Wait while comments are loading...