ప్రియుడి కోసం మన కోడి కూర...ఆర్డర్ చేసిన హాలీవుడ్ బ్యూటీ
ఆ మధ్య ఓ సారి భారతీయ వంటకాలను రుచి చూసిన జోలీ....ఆ టేస్టుకి ఫిదా అయిపోయారు. ముఖ్యంగా చికెన్ టిక్కా, చికెన్ కుర్మా లాంటి వంటకాలు ఆమెకు బాగా నచ్చాయి. ఇటీవల ఈ వంటకాలను ప్రత్యేకంగా ఆర్డర్ చేసి తెప్పించి బ్రాడ్ ఫిట్ కోసం విందు కూడా ఏర్పాటు చేసింది. ఆయన కూడా ఆ వంటకాలను లొట్టలేసుకుంటూ తినేసారట.
బ్రాండ్ ఫిట్ ప్రస్తుతం ఏంజెలీనా జూలీతో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. 2005లో బ్రాడ్, ఏంజెలినాల ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. అనంతరం బ్రాడ్ తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. ఏంజెలినాకు అప్పటికి రెండుసార్లు వివాహమైంది. ఆమె గతంలో జానీ లీ మిల్లర్, బిల్లీ బాబ్ థ్రాంటన్‌లను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం బ్రాడ్, ఏంజెలినాలకు ఆరుగురు పిల్లలున్నారు. వారిలో ముగ్గురు దత్తత తీసుకున్న పిల్లలు కాగా, మరో ముగ్గురికి వారు జన్మనిచ్చారు.
ఇటీవల బ్రాడ్ ఫిట్ 5 మిలియన్ పౌండ్ల(దాదాపు రూ. 40 కోట్లు)ను వెచ్చించి ఓ విలాసవంతమైన పడవను కొనుగోలు చేసి వార్తల్లో వ్యక్తిగా మారారు. సకల సౌకర్యాలతో కూడిన ఈ నౌకలో బ్రాడ్ ఫిట్ తన ఆరుగురు పిల్లలు, ఫియాన్సీ ఏంజెలీనా జోలీతో తరచూ షికార్లు చేస్తుంటారట.


Click it and Unblock the Notifications












