twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియుడి కోసం మన కోడి కూర...ఆర్డర్ చేసిన హాలీవుడ్ బ్యూటీ

    By Bojja Kumar
    |

    లండన్ : భారతీయ వంటకాల రుచి కిందకు ఏ ఇతర వంటకాలు సాటిరావు. చాలా మంది విదేశీయులు మన వంటకాలను లొట్టలేసుకుంటూ తింటూ ఉంటారు. ఈ జాబితాలో హాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఏంజెలీనా జోలీ కూడా చేరారు. అంతే కాదు తన ఫియాన్సీ బ్రాడ్ ఫిట్ కోసం పలు భారతీయ వంటకాలను కూడా ఆర్డర్ చేసారు.

    ఆ మధ్య ఓ సారి భారతీయ వంటకాలను రుచి చూసిన జోలీ....ఆ టేస్టుకి ఫిదా అయిపోయారు. ముఖ్యంగా చికెన్ టిక్కా, చికెన్ కుర్మా లాంటి వంటకాలు ఆమెకు బాగా నచ్చాయి. ఇటీవల ఈ వంటకాలను ప్రత్యేకంగా ఆర్డర్ చేసి తెప్పించి బ్రాడ్ ఫిట్ కోసం విందు కూడా ఏర్పాటు చేసింది. ఆయన కూడా ఆ వంటకాలను లొట్టలేసుకుంటూ తినేసారట.

    బ్రాండ్ ఫిట్ ప్రస్తుతం ఏంజెలీనా జూలీతో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. 2005లో బ్రాడ్, ఏంజెలినాల ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. అనంతరం బ్రాడ్ తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. ఏంజెలినాకు అప్పటికి రెండుసార్లు వివాహమైంది. ఆమె గతంలో జానీ లీ మిల్లర్, బిల్లీ బాబ్ థ్రాంటన్‌లను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం బ్రాడ్, ఏంజెలినాలకు ఆరుగురు పిల్లలున్నారు. వారిలో ముగ్గురు దత్తత తీసుకున్న పిల్లలు కాగా, మరో ముగ్గురికి వారు జన్మనిచ్చారు.

    ఇటీవల బ్రాడ్ ఫిట్ 5 మిలియన్ పౌండ్ల(దాదాపు రూ. 40 కోట్లు)ను వెచ్చించి ఓ విలాసవంతమైన పడవను కొనుగోలు చేసి వార్తల్లో వ్యక్తిగా మారారు. సకల సౌకర్యాలతో కూడిన ఈ నౌకలో బ్రాడ్ ఫిట్ తన ఆరుగురు పిల్లలు, ఫియాన్సీ ఏంజెలీనా జోలీతో తరచూ షికార్లు చేస్తుంటారట.

    English summary
    
 London: Actress Angelina Jolie arranged for spicy Indian delicacies like lamb bhuna, chicken korma and chicken tikka to be made here for her to fly home to her fiance, actor Brad Pitt. While on an official trip for the G8 summit in the city, Jolie arranged for a special consignment of the three dishes picked up from Pitt's favourite curry house in Surrey, reports thesun.co.uk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X