'టొక్యో'లో పిల్లలతో కలసి సినిమా ప్రమోషన్‌లో సూపర్ స్టార్
బ్రాడ్‌పిట్ హీరోగా నటించిన 'మనీబాల్' సినిమాని ప్రమోట్ చేసేందుకు గాను బ్రాడ్‌పిట్ భార్య ఏంజిలీనా జొలీ, వీరి పిల్లలు అందరూ కూడా ప్రస్తుతం జపాన్ రాజధాని 'టొక్యో'కి చేరుకున్నారు. జపాన్‌లో ఉన్న ఈ సూపర్ జంట అభిమానుల కొసం ప్రత్యేకంగా ఈ వీకెండ్లో ప్రీమియర్ షోని జపాన్‌లో ఉన్న అభిమానులతో కలసి ఈ జంట వీక్షించనుంది.
బ్రాడ్‌పిట్, ఏంజిలీనా జొలీ జంట ఎప్పుడెప్పుడూ జపాన్‌లో ఉన్న హనేడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెడతారా అని అభిమానులు ఎదురు చూశారు. ఎప్పుడైతే వారు జపాన్‌లో దిగారో లేదో అక్కడున్న అభిమానులు ఆటోగ్రాఫ్‌లు అంటూ ఎగబడడం జరిగింది. దాంతో జొలీ, పిట్‌లు అభిమానులకు అటోగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. జొలీ, పిట్‌ల పిల్లలు కూడా వీరితో పాటు రావడం జరిగింది.
ఏంజిలీనా జొలీ ఎప్పటిలాగే అందమైన రెడ్ కాక్‌టెల్ డ్రస్సుని ధరించగా, బ్రాడ్ పిట్ మాత్రం తనదైన శైలిలో బ్లాక్ డ్రస్సుతో పాటు, కళ్లకు గ్లాసెస్‌ని ధరించడం జరిగింది. బ్రాడ్‌పిట్, జొలీ జంట ఇంకాస్త ముందుగానే జపాన్ రావాల్సి ఉండగా, ప్రస్తుతం బ్రాడ్ పిట్ నటిస్తున్న కొత్త సినిమా జింబాబ్వే మూవీ 'వరల్డ్ వార్ జడ్' సినిమా షూటింగ్స్ వల్ల కొంచెం ఆలస్యం అయింది. 'వరల్డ్ వార్ జడ్' సినిమా షూటింగ్ ఇటీవలే బుదా పెస్ట్‌లో పూర్తి అవడంతో వీరు జపాన్‌లో మనీబాల్ సినిమాని ప్రమోట్ చేసేందుకు రావడం జరిగింది.
మనీబాల్ సినిమా ప్రీమియర్‌ని నవంబర్ 11న టొక్యోలో ఉన్న వేరు వేరు సినిమా ధియేటర్స్‌లలో ప్రదర్శించనున్నారు. జోలీ, పిట్‌లతో పాటు కొంత మంది అభిమానులు కలసి సినిమా చూడనున్నారు.


Click it and Unblock the Notifications











