మూడో భర్తకు టాటా.. నాలుగో వివాహానికి అందాల తార సిద్ధం!

By Rajababu

Recommended Video

ఆరుగురు పిల్లలతో నాలుగో మొగుడు కోసం ప్రయత్నాలు

ప్రముఖ నటి ఎంజెలీనా జోలీ ముచ్చటగా నాలుగోసారి ప్రేమలో పడిందనే వార్తలు హలీవుడ్‌‌లో వైరల్‌గా మారాయి. తాను ఇష్టపడి పెళ్లి చేసుకొన్న మూడో భర్త బ్రాడ్ పిట్‌తో తెగతెంపులు చేసుకొన్న ఎంజెలీనా నాలుగో పెళ్లికి సిద్ధమవుతున్నట్టు వార్తలు అందుతున్నాయి. బ్రిటన్‌కు చెందిన సంపన్నుడితో గతేడాదిగా అఫైర్‌ను కొనసాగిస్తున్నట్టు పత్రికలు కోడై కూస్తున్నాయి. త్వరలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు ఊపందుకొన్నాయి.

మూడో భర్తకు విడాకులు

మూడో భర్తకు విడాకులు

తన మాజీ భర్త బ్రాడ్ పిట్‌తో విడాకులకు ప్రయత్నిస్తునే బిటన్‌కు చెందిన బిలియనీర్‌తో అఫైర్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్నది ఎంజెలీనా. ఎంజెలీనా ప్రేమ వ్యవహారం హలీవుడ్‌ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ తన కొత్త ప్రియుడితో వ్యవహారం ముదిరితే ఆమె జీవితంలో నాలుగో భర్త రావడం ఖాయం.

వారి పరిచయం ఇలా

వారి పరిచయం ఇలా

ఎంజెలీనా కొత్త ప్రియుడి గురించి ఆసక్తికరమైన కథనం మీడియాలో చక్కర్లు కొడుతున్నది. బ్రిటన్ సంపన్నుడిని ఎంజెలీనాకు హాలీవుడ్ నటుడు జార్జ్ క్లూనీ అమల్ పరిచయం చేసిందట. రాజకీయాలకు సంబంధించిన విషయాలపై, స్వచ్ఛంద సేవకు సంబంధించిన అంశాలు వారి మధ్య రిలేషన్ బలపడటానికి దోహంద చ చేశాయట.

బ్రిటన్‌లో ఎంజెలీనా సెటిల్

బ్రిటన్‌లో ఎంజెలీనా సెటిల్

బ్రిటన్ సంపన్నుడు ఎవరు అనేది మాత్రం బయటకు రావడం లేదు. ఎంజెలీనా అతడిని పెళ్లి చేసుకొని బ్రిటన్‌కు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. త్వరలోనే మంచి బంగ్లాను చూసుకొని తన పిల్లలతో కలిసి లండన్‌లో సెటిల్ కాబోతున్నారట.

12 దాంపత్య జీవితానికి గుడ్‌బై

12 దాంపత్య జీవితానికి గుడ్‌బై

అయితే బ్రాడ్ పిట్‌కు దూరమైన తర్వాత తాను ఒంటరిగానే ఉంటున్నట్టు ఎంజెలీనా జోలీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. బ్రాడ్ పిట్‌తో 12 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలుకుతూ 2016లో అతడితో ఎంజెలీనా విడిపోయింది. ఎంజెలీనాకు ప్రస్తుతం ఆరుగురు పిలల్ల సంతానం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X