twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరోయిన్ డబ్బంతా కరిగిపోయిందా? కారణం ఏమిటి....

    |

    హాలీవుడ్ స్టార్ ఏంజెలీనా జోలీ తన భర్త బ్రాడ్ పిట్‌తో విడిపోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే పిల్లల కష్టడి వ్యవహారం ఎటూ తేలక పోవడంతో ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. ఓ వైపు ఈ కేసు నడుస్తూ ఉండగా మరో వైపు.... జోలీ వివిధ ప్రాజెక్టులు చేస్తూ బిజీగా గడుపుతున్నారు.

    అయితే ఇపుడ ఏంజెలీనా జోలీ పర్సనల్ లైఫ్ హాట్ టాపిక్ అయింది. గత కొన్నేళ్లుగా జోలీ యాక్టింగుకు దూరంగా ఉంటూ దర్శకత్వంపై ఫోకస్ పెట్టడంతో చాలా వరకు ఆదాయం కోల్పోయిందట. దీని కారణంగా ఆమె డబ్బు కూడా చాలా వరకు కరిగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.

    అవార్డులు వచ్చాయి కానీ...

    అవార్డులు వచ్చాయి కానీ...

    గత కొన్నేళ్లుగా పరిస్థితి గమనిస్తే... జోలీ వివిధ ప్రాజెక్టుల మీద పని చేశారు. ఈ క్రమంలో ఆమె ఆస్కార్ అవార్డుతో పాటు రెండు స్క్రీన్ యాక్టర్ గిల్డ్ అవార్డులు, మూడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు సొంతం చేసుకున్నాయి. అవార్డులు వచ్చాయిన కానీ ఆదాయం బాగా తగ్గిపోయిందట.

    లవ్ లెటర్ గురించి చెప్పిన హీరోయిన్ కీర్తి సురేష్... లవ్ లెటర్ గురించి చెప్పిన హీరోయిన్ కీర్తి సురేష్...

    హాలీవుడ్ హయ్యెస్ట్ పేయిడ్ యాక్టర్

    హాలీవుడ్ హయ్యెస్ట్ పేయిడ్ యాక్టర్

    ఏంజెలీనా జోలీ హాలీవుడ్లో హయ్యెస్ట్ పేయిడ్ యాక్టర్‌. కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నపుడు దర్శకత్వంలోకి దిగడం, దాని కారణంగా భారీ చిత్రాల్లో అవకాశాలు వదులుకోవడం లాంటి సంఘటనలు ఏంజోలీనా జోలి ఆర్థిక పరమైన ఇబ్బందుల్లోకి వెళ్లడానికి కారణమని అంటున్నారు.

    ఆ సినిమాకు వచ్చిన పేమెంట్ ఎంత?

    ఆ సినిమాకు వచ్చిన పేమెంట్ ఎంత?

    హాలీవుడ్ వెబ్ సైట్ల్ రీడర్ ఆన్ లైన్ కథనం ప్రకారం.... 43 ఏళ్ల ఏంజెలీనా జోలీ ఇటీవల నటించిన ‘మేల్‌పిసెంట్ 2' సినిమాకు గాను ఫుల్ పేమెంట్ 25 మిలియన్ డాలర్లు ఆర్జించినట్లు తెలుస్తోంది.

     మరిన్ని అవకాశాల కోసం వెయింటింగ్

    మరిన్ని అవకాశాల కోసం వెయింటింగ్

    యాక్టింగుకు దూరం అవ్వడంతో ఏంజెలీనా జోలికి చాలా కాలం తర్వాత ‘మేల్‌పిసెంట్ 2' రూపంలో బ్లాక్ బస్టర్ పడింది. ఇలాంటి మరిన్ని పెద్ద సినిమాల అవకాశాల కోసం ఆమె ఎదురు చూస్తోందని, ప్రస్తుతం ఆమె తన ఆర్థిక లోటును పూడ్చుకునే పనిలో ఉందని టాక్.

    English summary
    Angelina Jolie's personal life has remained the talk of the town. Recently, it was alleged that the millionaire actress is deprived of money because she has spent past years focusing on directing instead of acting.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X