అమెరికా అధ్యక్షున్ని చంపాలనుకున్నది ఎవరు
ప్రముఖ నటి ఏంజలీనా జోలీ నటించిన భారీ యాక్షన్ సినిమా సాల్ట్. భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందిన ఈ సినిమా ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఏంజలీనా జోలీ ఎవెలీన్ సాల్ట్ అనే పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా కథ ప్రకారం ఏంజలీనా జోలీ అమెరికాకు చెందిన CIA ఏజెంట్ గా పనిచేస్తూ వుంటుంది. అలా పనిచేస్తున్న ఆమెకు ఓ వ్యక్తి ద్వారా అమెరికా అధ్యక్షున్ని చంపేయడానికి కుట్రజరుగుతున్నట్టు తెలుస్తుంది. అలా అతన్ని విచారిస్తున్న ఆమెను షాక్ కు గురిచేసేలా కుట్రపన్నుతున్న వారి పేరు ఎవలీన్ సాల్ట్ అని ఆ వ్యక్తి వెళ్లడిస్తాడు. దీంతో ఆమెను రష్యాకు చెందిన గూఢాచారిగా అనుమానించి పోలీస్ అధికారులు ఆమెను హతమార్చడానికి ప్రయత్నిస్తారు.
వారినుండి తప్పించుకుంటూ సాల్ట్ ఎలా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంది అనేది మిగితా కథాంశం. ఇక ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ట్రెయిలర్లకు విశేష స్పందన లభిస్తోంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం ఈ సినిమాలో జోలీ యాక్షన్ సన్నివేశాల్లోనే కాదు హాట్ హాట్ సన్నివేశాల్లో కూడా జీవించిందని సమాచారం.


Click it and Unblock the Notifications











