ఏంజలీనా సాహసాలతో 'సాల్ట్'
హాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఎంజలీనా జోలీ సిఐఎ(CIA) ఏంజెంట్ గా నటిస్తోన్న చిత్రం 'సాల్ట్'. కథ విషయానికి వస్తే CIA ఏజెంట్ గా పనిచేస్తోన్న ఏంజలీనా జోలీ ని రష్యాకు చెందిన గూఢచారిగా అనుమానిస్తారు. ఆ తర్వాత ఆమె ఎలా వారి బారి నుండీ తనని తాను రక్షించుకొంటూ, తన నిజాయితీని నిరూపించుకుంది అనేది మిగిలిన కథ. కాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, ట్రెయిలర్ లు ఇటీవలే విడుదల చేసారు. ఇందులో జోలీ సాల్ట్ మరియు ఏంజీ అనే రెండు గెటప్ లలో కనిపిస్తుంది. ట్రెయిలర్లు చూసిన వారికి ఇందులో జోలీ చేసే సాహసకృత్యాలు ఎలా వుండబోతున్నాయో తెలుస్తుంది.
కొలంబియా పిక్చర్స్ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకులముందుక రానుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు: whoissalt.com లో చూడచ్చు.


Click it and Unblock the Notifications











