అలా కనిపించడానికి చాలా కష్టపడిందట
హాలీవుడ్ నటి, ప్రపంచంలోనే సెక్సీ ఉమన్ గా నిలిచిన ఏంజలీనా జోలీ ప్రస్తుతం 'సాల్ట్' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో జోలీ CIA ఏజెంట్ ఎవ్లీన్ సాల్ట్ పాత్రను పోషిస్తోంది. కాగా ఈ సినిమాలో ఆమె కొన్ని హాట్ హాట్ సన్నివేశాల్లో నటించాల్సివుందట. కానీ ఇటీవలే కవల పిల్లలకు జన్మనిచ్చిన జోలీ శరీరం సరైన ఆకృతిలో లేకపోవడంతో, ఆమె ఎంతో కష్టపడి తిరిగి తన శరీరాకృతిని క్రమబద్దీకరించుకొందట.
కాగా ఇటీవలే విడుదలయిన ఈ సినిమా ఆన్ లైన్ ట్రెయిలర్లకు మంచి స్పందన లభిస్తోంది. ఇందులో ఏంజలీనా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోందని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ సినిమా కోసం ఏంజలీనా ఆరు నెలల పాటు షూటింగ్ లో పాల్గొనగా బ్రాడ్ పిట్ తన పిల్లల సంరక్షణను చూసుకున్నాడుట. 2010లో ఈ సినిమా ప్రేక్షకులముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











