'టైటానిక్' హీరోతో 'టాంబ్ రైడర్' నాయిక
టైటానిక్ సినిమాతో పరిచయమైన కథానాయకుడు లినార్డినో డీ కాప్రియో టాంబ్ రైడర్ నాయిక ప్రపంచంలోనే సెక్సీఎస్ట్ ఉమన్ గా పేరొందిన ఎంజలీనా జోలీతో జత కట్టనున్నాడు. ఇందులో ఎంజలీనా మౌరీజియో గుస్సీ మాజీ భార్య పాత్రిజియా రెగ్గియానో పాత్రను పోషించనుంది. కథ విషయానికి వస్తే ఇందులో పాత్రిజియా తన భర్త గుస్సీ ని చంపినందుకు 29 ఏళ్ల పాటు జైలు జీవితం అనుభవిస్తుంది.
గుస్సీ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు రిడ్లే స్కాట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫాక్స్ 2000 నిర్మిస్తున్న ఈ సినిమా 1970, 80 లలో జరిగే కథ కావడంతో వారు మంచి స్క్రిప్ట్ రైటర్ కోసం వెతుకుతున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. కానీ లినార్డినో, జోలీ కన్నా చిన్నవాడిలా కనిపిస్తాడని ఇది మంచి ఛాయిస్ కాదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
ఎంజలీనా జోలీ లినార్డినో డీ కాప్రియో టైటానిక్ టాంబ్ రైడర్ హాలీవుడ్ hollywood angelina jolie leonardo di caprio titanic tomb rider


Click it and Unblock the Notifications