సాంప్రదాయ పద్దతిలో వివాహానికి సిద్దమైన సూపర్ స్టార్
లండన్: హాలీవుడ్లో స్టార్ హీరో, హీరోయిన్లుగా చెలామణి అవుతున్న ఏంజిలీనా జోలీ, బ్రాడ్ పిట్ త్వరలో వివాహం చేసుకుంటున్న తరుణంలో అటు అభిమానులు, ఇటు హాలీవుడ్ ప్రముఖులు వీరి వివాహంపై తెగ చర్చించుకుంటున్నారు. ఐతే ఏంజిలీనా జోలీ అధికార ప్రతినిధి వెల్లడించిన సమచారం ప్రకారం వీరి పెళ్లికి వివిధ జాతి సంప్రదాయాలు జోడించడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపాడు.
ఏంజిలీనా జోలీ, బ్రాడ్ పిట్ జరుపుకున్న వివాహం వేడుక ప్రజలకు వివిధ మార్గాల్లో ప్రతిబింబించాలని కోరుకుంటున్నారు. ఏంజిలీనా జోలీ ముగ్గురు పిల్లలకు జన్మనివ్వగా.. మరో ముగ్గురిని దత్తతు తీసుకున్న విషయం తెలిసిందే. కంబోడియా నుండి 10 సంవత్సరాల వయసు కలిగిన మాడక్స్, ఎధోపియా నుండి 7 సంవత్సరాల వయసు కలిగిన జహారాను, వియత్నాంకు చెందిన 9 సంవత్సరాల బాలుడు పాక్స్‌ని దత్తతు తీసుకుంది.
సో.. బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీ వివాహం విషయంలో ఆయాదేశాల సంప్రదాయాలు జోడించే విషయంలో ఇద్దరూ ఆలోచనలో ఉన్నారని తెలిసింది. వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో అద్బుతమైన ఘట్టం. ఈ అందమైన ఈవెంట్‌ని వివిధ జాతి సంప్రదాయాలు కలగలిపి చేసుకోవడంలో తప్పేముందని జోలీ తెలిపారు. పిట్ మాత్రం వీరి వివాహం ఫ్రెంచ్ సాంప్రదాయ పద్దతిలో చేసుకుందామని చెప్పినట్లు సమాచారం.
బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీల వివాహాం ఈ వేసవిలో దక్షణ ఫ్రాన్స్‌లో ఉన్న ఎస్టేట్‌లో పిట్, జోలీల 35 మిలియన్ పౌండ్ల విలువ చేసే ప్రయివేట్ ప్రార్దనాలయంలో చేసుకోనున్నట్లు సమాచారం. వీరి పెళ్లి ఫంక్షన్‌కు సుమారు 200 నుండి 300 వరకు గెస్టులను ఆహ్వానించనున్నారు. పెళ్లి తారీఖుని మాత్రం అధికారంగా ఇంకా వెల్లడించ లేదు. గెస్టుల లిస్ట్‌లో మాట్ డామన్, జార్జ్ క్లూనీ, జానీ డెప్ మరియు టామ్ క్రూజ్ లాంటి హాలీవుడ్ మహా మహులు రానున్నారు.


Click it and Unblock the Notifications











