»   » తాగినమత్తులో రచ్చ: హీరోయిన్‌ను విచారించిన ఎఫ్‌బి‌ఐ, ఏం జరిగింది?

తాగినమత్తులో రచ్చ: హీరోయిన్‌ను విచారించిన ఎఫ్‌బి‌ఐ, ఏం జరిగింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ఏంజిల్స్: హాలీవుడ్ జంటల్లో చాలా ఏళ్ల పాటు అన్యోన్యంగా జీవించిన జంట ఏంజెలీనా జోలీ-బ్రాడ్ పిట్. వీరి అన్యోన్యత చూసి వీరు జీవితాంతం కలిసి ఉంటారనే అంతా అనుకున్నారు. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ వీరు కూడా విడాకుల కోసం కోర్టుకెక్కారు.

వీరి విడాకులకు కారణం.... బ్రాడ్ పిట్ ప్రవర్తనే. దీనికి తోడు ఇటీవల ఫ్యామిలీతో కలిసి విమానంలో ప్రయాణం చేస్తుండగా బ్రాడ్ పిట్ తాగిన మత్తులో గొడవ పడ్డాడు, రచ్చ రచ్చ చేసాడు. మద్యం మత్తులో ఉన్న బ్రాడ్ పిట్ తన కుమారుడు మాడ్ డాక్స్ (15)ను దుర్భాషలాడి, కొట్టాడని వార్తలు వచ్చాయి.

ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే బ్రాడ్ పిట్ తో విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించింది జోలీ....

ఎఫ్.బి.ఐ అధికారుల విచారణ

ఎఫ్.బి.ఐ అధికారుల విచారణ

ఈ గొడవకు సంబంధించిన ఏంజెలినా జోలి ని అమెరికా దర్యాప్తు సంస్థ 'ఎఫ్ బీఐ' (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అధికారులు ప్రశ్నించారు. తన భర్త బ్రాడ్ పిట్ విమానంలో జరిగిన గొడవ గురించి దాదాపు నాలుగు గంటల పాటు జోలీని అధికారులు విచారించారు.

ఎఫ్.బి.ఐ ఎందుకు కలుగజేసుకోవాల్సి వచ్చింది?

ఎఫ్.బి.ఐ ఎందుకు కలుగజేసుకోవాల్సి వచ్చింది?

తమ ప్రశ్నలకు జోలీ ఓపిగ్గా సమాధానాలు ఇచ్చిందని ఎఫ్.బి.ఐ వర్గాలు తెలిపాయి. విమానంలో గొడవ జరిగినందునే తాము కలగజేసుకోవాల్సి వచ్చిందని చెప్పాయి. మరికొన్ని వారాల పాటు విచారణ జరిగే అవకాశం ఉందని తెలిపాయి. అయితే, కోర్టు కేసులకు దూరంగా ఉండాలని జోలీ, బ్రాడ్ పిట్ ఇద్దరూ భావిస్తున్నారని చెప్పాయి.

పదకొండేళ్లుగా..

పదకొండేళ్లుగా..

గత పదకొండేళ్లుగా ఎంతో అన్యోన్యంగా జీవనం సాగిస్తున్న ఈ ఇద్దరూ....ఆదర్శ ప్రేమికులుగా, ఆదర్శ దంపతులుగా కీర్తిగడించారు. వీరి మధ్య ప్రేమానురాగాలు చూసి చాలా మంది వీరు ఎప్పటికీ విడాకుల జోలికి పోరు అని భావించే వారు. అయితే అందుకు వీరేమీ అతీతులు కాదని తేలిపోయింది.

ఎఫైర్...

ఎఫైర్...

బ్రాడ్ పిట్ కొంతకాలంగా మరొక నటితో ఎఫైర్ పెట్టుకోవడం కూడా వీరి మధ్య గొడవలు జరగడానికి కారణమని తెలుస్తోంది. ఆ కోపం ఇటీవల విమానంలో పిల్లలపై చూపించాడని టాక్.

ఆ వయసులో ఏంజలీనా జోలీ హాట్ అండ్ సెక్సీగా..

ఆ వయసులో ఏంజలీనా జోలీ హాట్ అండ్ సెక్సీగా..

ఆ వయసులో ఏంజలీనా జోలీ హాట్ అండ్ సెక్సీగా..రేర్ ఫోటోస్ కోసం క్లిక్ చేయండి

ఏంజలీనా జోలీ న్యూడ్ ఫోటో షూట్

ఏంజలీనా జోలీ న్యూడ్ ఫోటో షూట్

ఫోటోల కోసం క్లిక్ చేయండి....

English summary
Angelina Jolie 'was interviewed for FOUR hours by the FBI' about private plane incident that led her to file for divorce from Brad Pitt.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu