షూటింగ్ స్పాట్‌కి పిల్లలతో వెళ్లి సర్ ప్రైజ్ ఇచ్చిన హీరోయిన్
హాలీవుడ్ అందగత్తె ఏంజిలీనా జోలీ బుధవారం లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్ట్‌లో సడన్‌గా ప్రత్యక్షమైంది. దాంతో ఎయిర్ పోర్ట్‌లో కొంత సందడి వాతావరణం నెలకొంది. ఇంతకీ ఏంజిలీనా జోలీ లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్ట్‌లో ప్రత్యక్షమవడానికి కారణాలు ఏంటని ఆరా తీస్తే ఇవని తేలిసింది. ఏంజిలీనా జోలీ భర్త బ్రాడ్ పిట్ ప్రస్తుతం మాల్టా లో వరల్డ్ వార్ జడ్ అనే సినిమా షూటింగ్‌లో ఉన్నారు. తన భర్త బ్రాడ్ పిట్‌ని చూడడానికి పిల్లలు జహారా, షైలోలతో కలసి ఏంజిలీనా జోలీ అక్కడికి వెళ్లి వస్తూ లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్ట్‌లో దిగింది అన్నమాట.
ఏంజిలీనా జోలీ, జహారా, షైలో ముగ్గురు కూడా మాల్టా ట్రిప్‌ని బాగా ఎంజాయ్ చేసి వచ్చినట్లు వారి ముఖాలు చూస్తే కనిపిస్తుందని అక్కడ వారు అంటున్నారు. ది వరల్జ్ వార్ జడ్ అనే హార్రర్ సినిమాలో బ్రాడ్ పిట్ లీడ్ రోల్ పోషిస్తుండడంతో సినిమా షూటింగ్ మాల్టాలో జరుగుతుండడంతో పిల్లలు బ్రాడ్ పిట్‌ని చూడాలని మారం చేయడంతో ఏంజిలీనా జోలీ అక్కడకి వెళ్లినట్లు సమాచారం. ఇక వరల్డ్ వార్ జడ్ అనే సినిమా వరల్డ్ వార్ జడ్ అనే నవల ఆధారంగా రూపోందించడం జరుగుతుంది. మ్యాక్స్ బుక్స్ వారు 2006వ సంవత్సరంలో ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా చాలా ఉత్కంఠ భరితంగా, హారర్ నేఫద్యంలో షూటింగ్ జరుపుకుంటుందని సమాచారం.
ఇక ఎయిప్ పోర్ట్‌లో ఏంజిలీనా జోలీ బ్లాక్ డ్రస్సుతో పాటు ఎప్పటిలాగే తనకు ఇష్టమైన ఐకానిక్ సన్ గ్లాసెస్‌ను ధరించారు. పిల్లలు జహారా, షైలో ఇద్దరూ కూడా చాలా కలర్‌పుల్‌గా ఉన్నారు. జహారా జీన్స్ ప్యాయింట్ పైకి తెల్లని చొక్కా ధరించి ఒక చేతిలో బోమ్మతో ఇంకో చేతిని వాళ్ల అమ్మ చేతిలో ఉంచింది. అదేవిధంగా షైలో కూడా మోస్ట్ స్టయిలిష్ బట్టలు ధరించింది. ఇది ఇలా ఉంటే త్వరలో పిల్లల కొరిక మేరకు పెళ్శి చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆరు సంవత్సరాల నుండి కలిసి ఉంటున్న వీరిద్దరికి ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఫ్రాన్స్‌లో త్వరలో వీరి పెళ్శి జరగనుందని సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా ఈ జంటే వెల్లడిస్తారని ప్రముఖ అమెరికా పత్రిక వెల్లడించింది.


Click it and Unblock the Notifications











