twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోపంతో అమెరికాపై విరుచుకు పడ్డ జాకీ చాన్‌

    By Srikanya
    |

    హాంగ్‌కాంగ్‌ : అంతర్జాతీయ హీరో జాకీఛాన్ ...అమెరికా పై,దాని విధానాలపై ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. తమ దేశం చైనాను అమెరికా కామెంట్ చేసే అర్హత లేదని తేల్చి చెప్పారు. చైనాలో అవినీతి అధికమైందని అమెరికన్‌ మీడియా దుమ్మెత్తి పోయటంతో ప్రముఖ హాలీవుడ్‌ నటుడు జాకీ చాన్‌ తీవ్రంగా స్పందించారు. అమెరికా ప్రపంచంలోనే అత్యంత అవినీతి దేశమని అన్నారు.

    చైనీస్‌ ఫీనిక్స్‌ టివి చానెల్‌కు జాకీఛాన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. చాలాకాలం నుంచి చైనాపై అంతర్జాతీయ దేశాలు బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. చైనా ఇటీవలే ఆర్ధికంగా పురోగమించిందన్నారు. చైనాలో అవినీతి సమస్యలుంటే ఉండవచ్చు ఇతర దేశాలలో లేవా అని ప్రశ్నించారు. సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పత్రిక ఈ వివరాలను ప్రచురించింది.

    అలాగే చైనా కాదు అమెరికా మాత్రమే ప్రపంచంలో అత్యంత అవినీతి దేశం అని గట్టిగా చెప్పారు. అవినీతి అనేది యుఎస్‌ నుంచి మాత్రమే ప్రారంభమైందన్నారు. '' నా దేశప్రజలను నేను సమర్ధించుకోకపోతే ఎవరు సమర్ధిస్తారు.?'' అని ప్రశ్నించారు. ప్రధాని వెన్‌ జిబావోతో పాటు పలువురు రాజకీయనేతలు అక్రమాస్తులు కూడబెట్టారని అమెరికన్‌ మీడియా లెక్కలు కట్టింది. జిబావోకు 2.7 బిలియన్‌ డాలర్ల ఆస్తులున్నట్లు పేర్కొంది.

    ఇక క్రిందటి నెల 28న జాకీచాన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సీజెడ్‌ 12' (చైనీస్‌ జోడియాక్‌) విడుదలైంది. ఓపినింగ్స్ బాగానే ఉన్నా ఈ చిత్రం విజయం సాధించలేకపోయింది. ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన 'ఆర్‌మోర్ అఫ్ గాడ్' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న మూడవ చిత్రమిది. 12ఏళ్ల తర్వాత జాకీచాన్ నటించి దర్శకత్వం వహించిన భారీ చిత్రమిది. ఈ సినిమాకి సంబంధించిన పలు క్రాఫ్ట్‌ల్ని నిర్వహించిన దర్శక, హీరోగా చేసిన జాకీ చాన్ పేరిట గిన్నిస్‌ రికార్డు నమోదైంది. జ్యోతిషం ప్రకారం మనకున్న పన్నెండు రాశులకు సంబంధించిన ప్రతిమలను సంపాదించడమే ధ్యేయంగా తెరపై హీరో చేసిన సాహసాలతో సినిమా నడుస్తుంది. ఈ చిత్రం తెలుగులో 'దొంగలకు దొంగ' పేరుతో అనువాదమైంది.

    English summary
    Riled by US media reports highlighting corruption in China, Hong Kong based Hollywood star Jackie Chan has hit back at America branding it as the world's "most corrupt" country. Chan told Chinese Phoenix TV that China has been bullied by international powers for a long time and started making progress only in recent year
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X