పిట్, జోలీల వివాహాంపై మాజీ భార్య ఆనిస్టన్ వ్యాఖ్య
లాస్ ఏంజిల్స్: బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీల వివాహా వార్త తెలిసి సంతోషించే వాళ్లలలో నేను ఉన్నానంటూ బ్రాడ్ పిట్ మాజీ భార్య జెన్నిఫర్ ఆనిస్టన్ సెలవిచ్చారు. ఈ సందర్బంలో జెన్నిఫర్ ఆనిస్టన్ మాట్లాడుతూ నేను చాలా సంవత్సరాలు పిట్‌తో కలసి ఉన్నప్పటికీ.. గతం గురించి తాను ప్రస్తుతం ఆలోచించడం లేదని స్పష్టం చేశారు.
43 సంవత్సరాల వయసు కలిగిన జెన్నిఫర్ ఆనిస్టన్ తన మాజీ భర్త పిట్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత జస్టిన్ థ్రాక్స్‌తో డేటింగ్ చేస్తున్నారు. ఆనిస్టన్ ఎప్పుడూ పిట్ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆనిస్టన్ ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం ఆనిస్టన్ జస్టిన్ థ్రాక్స్‌తో సంతోషంగా ఉన్నట్లు సమాచారం. పిట్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత ఆనిస్టన్ తన సంతోషానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారు.
బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీల వివాహాం ఈ వేసవిలో దక్షణ ఫ్రాన్స్‌లో ఉన్న ఎస్టేట్‌లో పిట్, జోలీల 35 మిలియన్ పౌండ్ల విలువ చేసే ప్రయివేట్ ప్రార్దనాలయంలో చేసుకోనున్నట్లు సమాచారం. వీరి పెళ్లి ఫంక్షన్‌కు సుమారు 200 నుండి 300 వరకు గెస్టులను ఆహ్వానించనున్నారు. పెళ్లి తారీఖుని మాత్రం అధికారంగా ఇంకా వెల్లడించ లేదు.
గెస్టుల లిస్ట్‌లో మాట్ డామన్, జార్జ్ క్లూనీ, జానీ డెప్ మరియు టామ్ క్రూజ్ లాంటి హాలీవుడ్ మహా మహులు రానున్నారు. గత ఏడు సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్న బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీ శనివారం నిశ్చితార్దం జరిగినట్లు అధికారకంగా వెల్లడించారు. ప్రస్తుతానికి వారి పెళ్లి తేదీ ఇంకా ఖరారు కాలేదు' అని ఆమె తెలిపారు. పెళ్లి కోసం బ్రాడ్ 2.50 లక్షల డాలర్ల విలువైన వజ్రపుటుంగరం చేయించినట్లు బెవర్లీ హిల్స్ జ్యూయలర్ రాబర్ట్ ప్రొకాప్ వెల్లడించారు.
పిట్, జోలీలు 2004లో మిష్టర్ అండ్ మిసెస్ స్మిత్ సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. అప్పటికే పిట్‌కు జెన్నిఫర్ అనిస్టన్‌తో వివాహమైంది. 2005లో బ్రాడ్, ఏంజెలినాల ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. అనంతరం బ్రాడ్ తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. ఏంజెలినాకు అప్పటికి రెండుసార్లు వివాహమైంది. ఆమె గతంలో జానీ లీ మిల్లర్, బిల్లీ బాబ్ థ్రాంటన్‌లను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం బ్రాడ్, ఏంజెలినాలకు ఆరుగురు పిల్లలున్నారు. వారిలో ముగ్గుర్ని దత్తత తీసుకోగా, మరో ముగ్గురికి జన్మనిచ్చారు.


Click it and Unblock the Notifications











