నెట్‌లో ఆ టిప్స్ తెలుసుకోవడం 'లేజర్ పోర్న్'
హాలీవుడ్ స్టార్ హీరోయిన్, బ్రాడ్ పిట్ మాజీ భార్య జెన్నిఫర్ ఆనిస్టన్ ఇటీవల మెన్స్ హెల్త్ మ్యాగజైన్ రూపొందించిన కార్యక్రమంలో 'హాటెస్ట్ ఉమెన్' అవార్డుని దక్కించుకుంది. ఆనిస్టన్ తాను సంపాదించిన మొత్తంలో ఎక్కువ భాగం డబ్బుని తన బ్యూటీ టిప్స్‌కే కేటాయించనున్నట్లు ఈ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపింది. దీనితో పాటు ఆన్ లైన్‌లో తాను ఎక్కుగా చర్మానికి సంబంధించిన లేజర్ టిప్స్‌ని ఎక్కువగా చదువుతానని అన్నారు.
ఆనిస్టన్ మాట్లాడుతూ చర్మనిపుణుడిగా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చర్మానికి సంబంధించిన టిప్స్‌ని ఎక్కువగా చదవడమే కాకుండా, చర్మ ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ప్రొడక్ట్స్, లేజర్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. ఇంటర్నెట్‌కి వెళ్లానంటే నేను ఎక్కువగా వీటికి సంబంధించిన సమాచారం ఎక్కువగా సేకరిస్తాను.. నిజం చెప్పాలంటే ఇలా చేయడాన్ని లేజర్ పోర్న్ అంటారు.
బ్యూటీ గురించి జెన్నిఫర్ ఆనిస్టన్ నేను ఎటువంటి దుస్తులు ధరిస్తే వయసు ఎక్కువగా కనిపిస్తానో నాకు తెలుసు. సాధారణంగా ఇరవై సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయిలతో సరిపోల్చుకూడదు. అందుకు కారణం వారి వయసు నా వయసు వేరు కాబట్టి వారిలాగే నేను కనిపించాలనే చర్మ సౌందర్యానికి అన్ని రకాల టిప్స్‌ని తీసుకుంటాను. 43 సంవత్సరాల వయసు కలిగిన జెన్నిఫర్ ఆనిస్టన్ ప్రస్తుతం వయసులో తనకంటే చిన్నవాడైన జస్టిన్ థ్రాక్స్‌తో డేటింగ్ చేస్తుంది.


Click it and Unblock the Notifications











