భర్త నుండి విడిపోయిన తర్వాత ఎవరితో డేటింగ్ లో పోల్గోనకుండా ఉన్న హీరోయిన్ ఆమెనంటా..!
హాలీవుడ్ లో వానిటి ఫెయిర్ ఇటీవల ఓ విచిత్రమైన సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వే ఏంటంటే పెళ్శి అయిన తర్వాత భర్త నుండి విడిపోయిన తర్వాత కూడా ఎవరితోను డేటింగ్ లో పాల్గోనకుండా ఎవరైతే సింగిల్ గా ఉంటారాఅని అనుమానం వారికి కలగడంతో అనుకున్నదే తడవుగా వానిటి ఫెయిర్ సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో మొట్టమొదటి స్దానం లో హాలీవుడ్ ఒకప్పటి అందాలహీరోయిన్ బ్రాడ్ పిట్ మాజీ భార్య జెన్నిఫర్ ఆగస్టిన్ సోంతం చేసుకుంది. ఈ కార్యక్రమానికి గాను ప్రపంచం మొత్తం మీద చాలా మంది హీరోయిన్లు తీసుకున్నప్పటికి జెన్నిఫర్ ఆగస్టిన్ ను వరల్డ్స్ మోస్ట్ ఎలిజిబుల్ సింగిల్ ఉమెన్ గా ఎన్నుకోవడం జరిగిందని సర్వే నర్వహించిన వానిటి ఫెయిర్ అనే సంస్ధ తెలిపింది. ఈ 41సంవత్సరాల అందగత్తే 29శాతం ఓట్లు సాధించి మొట్టమొదటి స్దానం సంపాదించింది. ఇందులో మగవారు ఈమెకు 27శాతం ఓట్లు మగవారు వేయగా, ఆడవారు మాత్రం 32శాతం ఓట్లు వేయడం జరిగిందన్నారు.
అంతేకాకుండా రెండవ స్దానంలో నల్లజాతి ఆణి ముత్యం హాలీబెర్రికి పట్టం కట్టారు. మొన్న ఈ మధ్య విడాకులు తీసుకున్నటు వంటి టైగర్ వుడ్స్ మాజీ భార్య ఎలిన్ గోర్డాన్ కు మూడవ స్దానం, గోల్డెన్ గర్ల్ స్టార్ బెట్టి వైట్ నాల్గవ స్దానం మరియు పాప్ సింగర్ లేడిగాగా కు అయిదవ స్దానాన్ని వారి అభిమానులు పట్టం కట్టారు. చివరగా యుయస్ సుప్రీమ్ కోర్టు కొత్త జస్టిస్ అయినటువంటి ఎలీనా కాగన్ ఆరవ స్దానం లో ఉన్నారని వారు తెలిపారు.


Click it and Unblock the Notifications











