twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేమ కోసం సినిమాలను సంవత్సరం వదిలేస్తున్న హీరోయిన్

    By Nageswara Rao
    |

    బ్రాడ్‌పిట్ మాజీ భార్య జెన్నిఫర్ ఆనిస్టన్ హాలీవుడ్ నుండి ఒక సంవత్సరం బ్రేక్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇంతకీ ఈ నిర్ణయం ఎవరికోసం తీసుకుందని అనుకుంటున్నారా తన కొత్త బాయ్ ప్రెండ్ జస్టిన్ ధ్రాక్స్ కోసం. అమెరికా మ్యాగజైన్ కధనం ప్రకారం జెన్నిఫర్ ఆనిస్టన్ గతంలో హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్ పిట్‌ని పెళ్శి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వారిద్దరూ విడాకులు తీసుకొని విడిపోడం జరిగింది. బ్రాడ్ పిట్ మాత్రం హాలీవుడ్ అందగత్తె ఎంజిలీనా జోలిని పెళ్శి చేసుకోగా, జెన్నిఫర్ ఆనిస్టన్ మాత్రం సింగిల్‌గా జీవనం సాగిస్తూ అప్పుడప్పుడు ఏవో రూమర్స్‌లోకి వస్తూ ఉండిపోయింది.

    సాధారణంగా జెన్నిఫర్ ఆనిస్టన్‌కు ప్రేమ అనే పదం కలసి రాలేదనే చెప్పాలి. కారణం బ్రాడ్ పిట్‌తో విడాకులు తీసుకున్న తర్వాత చాలా మంది సెలబ్రిటీలతో సంబంధాలు పెట్టుకన్నప్పటికీ అవన్ని ఫెయిల్ కావడంతో ఇప్పుడు జెన్నిఫర్ తన కెరియర్ కంటే కూడా తన ప్రేమ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని ఒక సంవత్సరం తన ఫిల్మ్ ఇండస్ట్రీకి సెలవుపెట్టి ప్రేమ విషయం తేల్చుకోవాలని చూస్తుంది. 42సంవత్సరాల వయుసు ఉన్న జెన్నిఫర్ ఆనిస్టన్ నటించిన మూడు సినిమాలు హాలీవుడ్‌లో విడుదలకు సిద్దంగా ఉన్నాయి.

    అంతేకాకుండా ప్రస్తుతానికి జెన్నిఫర్ ఆనిస్టన్ ఎటువంటి కొత్త సినిమాలకు సంతకం చేయకపోవడంతో ఈ నిర్ణయం నిజమని అందరూ నమ్ముతున్నారు. ఇది మాత్రమే కాకుండా జెన్నిఫర్ బాయ్ ప్రెండ్ జస్టిన్ ధ్రాక్స్ కూడా మాట్లాడుతూ వర్కు నుండి ఉపశమనం ఒక్క సంవత్సరం పాటు సెలవు తీసుకుందని అన్నారు. జెన్నిఫర్ ఆనిస్టన్ నటించిన హారిబుల్ బాసెస్ తర్వాత అక్టోబర్‌‌లో విడుదల అవ్వడానికి సిద్దంగా ఉన్న వ్యాండర్స్ లస్ట్ సినిమా తర్వాత జెన్నిఫర్ డేట్స్ కేవలం ద గూరీ గర్ల్స్ అనే సినిమాకు మాత్రమే ఉన్నాయని తెలిపారు.

    ఇక జస్టిన్ ధ్రాక్స్ గతంలో హాలీవుడ్‌కి సూపర్ డూపర్ హిట్ సినిమాలైనటువంటి ట్రోఫిక్ ధండర్, ఐరన్ మ్యాన్ 2 లకు స్క్రీన్ ప్లే అందించారు. జెన్నిఫర్ అతని యొక్క స్క్రీన్ ప్లే, కధనం నచ్చి ప్రేమలో పడిందని అనుకుంటున్నారు. జెన్నిఫర్ ఆనిస్టన్ కోసం 39సంవత్సరాల వయసు ఉన్న జస్టిన్ ధ్రాక్స్ తనని పద్నాలుగు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నటువంటి ప్రియురాలు హైదీ బివెన్స్‌కి గుడ్ బాయ్ చెప్పడం జరిగింది. ఇటీవలే జెన్నిఫర్ ఆనిస్టన్, జస్టిన్ ధ్రాక్స్ ఇద్దరూ కలసి న్యూయార్క్ లోని పేస్ యూనివర్సిటీలో జరిగిన ఓ ఫంక్షన్‌కి హాజరయ్యారు.

    English summary
    Jennifer Aniston is reportedly taking a one-year break from Hollywood to focus on her love life with new boyfriend Justin Theroux.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X