రొమాంటిక్ ఫోటోషూట్లో ఒకరికి ఒకరు తోడుగా..
బ్రాడ్ పిట్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత జెన్నిఫర్ ఆనిస్టన్ ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్న విషయం తెలిసిందే. సాధారణంగా ఒంటరిగా ఉన్న ఆడవారంటే అందరికి లోకువే. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఇది మరీ చాలా తేలిక. ఒంటరిగా జీవనం సాగిస్తున్న సెలబ్రిటీలు సొసైటీలో చాలా తేలికగగానే వార్తల్లోకి వస్తుంటారు. జెన్నిఫర్ ఆనిస్టన్ విషయంలో కూడా సరిగ్గా ఇలాంటిదే జరిగింది.
ఇటీవల కాలంలో జెన్నిఫర్ ఆనిస్టన్ స్టార్ హీరో జస్టిన్ ధ్రాక్స్‌తో డేటింగ్ చేస్తుందంటూ ప్రచారం జరిగింది. ఈ విషయం జెన్నిఫర్ ఆనిస్టన్ దగ్గర ప్రస్తావించగా ఆమె దీనిపై మాట్లాడడానికి సున్నితంగా తిరస్కరించారు. ఐతే ఇది ఇలా ఉండగా ఇటీవలే హాలీవుడ్ ప్రముఖ ఫోటోగ్రాఫర్ టెర్రీ రిచర్డ్సన్‌కి ఇద్దరూ కొన్ని రొమాంటిక్ ఫోటోలకు ఫోజులివ్వడం జరిగింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్‌లో హాల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలను చూసిన వారంతా వీరిద్దరూ పైకి మామధ్య ఏ సంబంధం లేదంటూ ఇలా పబ్లిక్‌గా రోమాంటిక్ ఫోజులివ్వడం విస్మయాన్ని కలగిస్తుంది.
ఫోటోగ్రాఫర్ టెర్రీ రిచర్డ్సన్ వీరిద్దరికి సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను న్యూయార్క్ నగరంలో తీయడం జరిగింది. ఈ ఫోటోలు బట్టి చూస్తుంటే వీరిద్దరూ కూడా మంచి సాన్నిహితంగా తిరుగుతున్నట్లు కనిపిస్తున్నారు. టెర్రీ రిచర్డ్సన్ వీరిద్దరి రొమాంటిక్ ఫోటోల ఆల్బమ్‌కి 'న్యూయార్క్ లవ్ స్టోరీ' అని పేరును పెట్టారు. ఇంటర్నెట్లో దర్శనమిస్తున్న ఈ ఫోటోలలో 42సంవత్సరాల వయసు కలిగిన జెన్నిఫర్ ఆనిస్టన్ చెంప మీద జస్టిన్ ధ్రాక్స్ ముద్దు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











