twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎంతో ఇష్టపడి చేస్తే వచ్చింది ఆ క్యాట్ ఉమెన్ షేప్

    By Nageswara Rao
    |

    హాలీవుడ్ సెక్సీ భామ 28 సంవత్సరాల వయసు కలిగినటువంటి అన్నే హాత్వే నటించిన బ్యాట్ మెన్ సిరిస్‌లో తదుపరి సినిమా 'డార్క్ వైట్ రైజెస్' సినిమా గురించి తన మనసులోని మాటలను మాట్లాడేటటువంటి షో 'చెల్సియా లేట్‌లే' వెల్లడించారు. 'డార్క్ వైట్ రైజెస్' సినిమాలో క్యాట్ ఉమెన్‌ ధరించే దుస్తుల కోసం ప్రత్యేకంగా జిమ్ కెళ్లి మరీ తన బాడీని స్లిమ్‌గా తయారు చేయడం జరిగిందని తెలిపారు. సినిమా ఒప్పుకొక ముందు నేను చాలా సన్నగా ఉండడం చూసి డైరెక్టర్ క్యాట్ ఉమెన్ ఎలా ఉండాలో ఆ విధంగా నా శరీరాన్ని వర్క అవుట్స్ చేసి పెంపోందించుకోవాల్సిందిగా కోరడం జరిగిందని తెలిపారు.

    క్యాట్ ఉమెన్‌కి తగిన శరీరం కోసం ఇటీవల కొత్తగా యోగ కూడా చేయడం మొదలు పెట్టడం జరిగిందని తెలియజేశారు. అంతేకాకుండా అభిమానులకు మరో కొత్త విషయం తెలియజేశారు. ఆ కొత్త విషయం ఏమిటంటే నేను ఏ జిమ్‌లోనైతే వర్క్ అవుట్స్ చేస్తానో అదే జిమ్‌లో ప్రస్తుతం ప్రెగ్నెంట్ అయిన జెస్సికా ఆల్బా కూడా వర్క్ అవుట్స్ చేస్తారు. ఇది మాత్రమే కాకుండా నేను తీసినటువంటి పుష్ అప్స్ కంటే కూడా జెస్సికా ఆల్బా నాకంటే ఎక్కువ పుష్ అప్స్ చేసేవారని తెలియజేశారు.

    నిజంగా 'డార్క్ వైట్ రైజెస్' సినిమా నటించడం నా అదృష్టం. అందుకు కారణం క్యాట్ ఉమెన్ క్యారెక్టర్ నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. అంతేకాకుండా షూటింగ్ సమయంలో క్యాట్ ఉమెన్ డ్రస్సు ధరిచేందుకు సుమారు ముగ్గురు అసిస్టెంట్స్ నాకు ఆ డ్రస్సుని వేయడం, అదే షూటింగ్ అయిపోయిన తర్వాత తీయడం జరిగేదని తెలిపారు.

    English summary
    Anne Hathaway has said that she continues to struggle with the diet and exercise regimen she is following for The Dark Knight Rises.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X