Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
మేకప్ లేకపోతే ఎంత పెద్ద సూపర్ స్టారైనా కనుక్కొవడం కష్టం
హాలీవుడ్ గ్లామర్ గర్ల్ అన్నే హాత్వే ఎప్పుడూ రెడ్ కార్పెట్ మీద అందంగా తయారై వస్తుంటే ఆమెని దేవకన్యగా భావించే అభిమానులు ఒక్కసారిగా ఆమెను మేకప్ లేకుండా చూసి నివ్వెర పోయారు. అంతే కాదండోయ్ అసలు ఆమె అన్నే హాత్వే కాదంటే కాదు అని కూడా కొంత మంది బెట్టింగులు నిర్వహించారు. దీనిని బట్టి మనకు తెలిసింది ఏమిటంటే సెలబ్రిటీలు, హీరోయిన్లు మేకపే వేసుకుంటేనే చూడడానికి అందంగా కనిపిస్తారు. మేకప్ లేకుండా బయటకు వచ్చారంటే వారిని కనుక్కొవడం చాలా కష్టం అని ఓ ప్రముఖ హాలీవుడ్ పత్రిక వెల్లడించింది.
అన్వే హాత్వే తన బాయ్ ప్రెండ్ ఆడమ్ సుల్మన్‌తో ఎటువంటి మేకప్ లేకుండా, న్యూయార్క్ నగర వీధుల్లో విహారించేందుకు వచ్చారు. 28 సంవత్సరాలు వయసు కలిగిన అన్నే హాత్వే తలపై గోధుమ రంగు టోపిని ధరించి, ముఖానికి ఎటువంటి మేకప్ లేకుండా బయటకు రావడం జరిగింది. దాంతో అన్నే హాత్వేని ఏ ఒక్క అభిమాని కూడా గుర్తు పట్టలేని విధంగా ఉంది. ప్రక్క చిత్రంలో గనుక మీరు చూసినట్లైతే మీకు క్లియర్‌గా అర్దం అవుతుంది.
న్యూయార్క్‌లోని బ్రూక్లెన్ ఏరియాలో జిమ్‌కి వచ్చిన అన్నే హాత్వే బ్లాక్ జాకెట్‌తో దర్శనమిచ్చింది. అదే ఇటీవల బేవరీ హిల్స్‌లో జరిగిన హాలీవుడ్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమానికి మాత్రం దేవకన్యలా హాజరైన ఫోటోని ప్రక్క చిత్రంలో చూడండి. రెండు పోటోలలో ఉన్న ఒకే మనిషి మద్య ఎంత వ్యత్యాసం ఉందో మనకు ఫోటోలను చూస్తే అర్దమై పోతుంది.