బాయ్ ప్రెండ్‌తో ఎంజాయ్ చేస్తూ మీడియాకి చిక్కిన హీరోయిన్
హాలీవుడ్ యువరాణి అనగానే ఠక్కున గుర్తుకువచ్చే పేరు అన్నే హాత్వే. లవ్ అండ్ అదర్ డ్రగ్స్ సినిమాలో తన నటనా చాతుర్యంతో అభిమానుల గుండెల్లో సుస్దిర స్దానాన్ని సంపాదించుకుంది. ఇటీవల ఇటలీలోని కాప్రీలో బికినీలో తన బాయ్ ప్రెండ్‌ఆడమ్ సుల్మాన్‌తో కలసి స్నానం చేస్తూ మీడియాకు దొరికిపోయింది.
వివరాల్లోకి వెళితే అన్నే హాత్వే, ఆమె బాయ్ ప్రెండ్ ఆడమ్ సుల్మాన్ ఇద్దరూ కలసి బోట్‌లో స్విమ్మింగ్ చేయడానికి వెళ్లడం జరిగింది. ఇద్దరూ కలసి అలా సరదాగా ఈతని ఎంజాయ్ చేసిన తర్వాత టవల్స్ కోసం బోట్ ఎక్కినప్పుడు వారివురిని ఫోటోలు తీయడం జరిగింది. ఈ సందర్బంలో వారు ఫోటోలు తీస్తున్నవారిని చూసి ఎటువంటి అదైర్య పడకుండా చక్కగా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వారిద్దరి మద్య ఉన్న సంబంధం అందరికి తెలియజేసేందుకు వీరిద్దరూ అలా చేశారని అక్కడున్న వారంతా అనుకున్నారు.
ఇక అన్నే హాత్వే ధరించిన స్విమ్ షూట్ చాలా అందంగా ఉంది. ప్రస్తుతం అన్నే హాత్వే ఫ్యాషన్ షోలలో పాల్గోంటూ బిజిబిజీగా సమయాన్ని గడుపుతుంది. అందుకు కారణం ఈ నెలమొదట్లో జరిగినటువంటి పారిస్ ప్యాషన్ వీక్, వ్యాలెన్టినో షోలో కూడా హాల్ చల్ చేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











