twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జ్యువెలరీ డిజైనర్‌ను పెళ్లాడిన అన్నా హాత్వే

    By Bojja Kumar
    |

    కాలిఫోర్నియా : హాలీవుడ్ స్టార్ అన్నా హాత్వే జ్యువెల్లరీ డిజైనర్ ఆడమ్ సుల్మన్ ను ఆదివారం పరిణయమాడింది. 29 సంవత్సరాల వయసు కలిగిన అన్నే హాత్వే 2008 నుండి ఆడమ్ సుల్మన్‌తో డేటింగ్ చేస్తున్నారు. గత యేడాది నవంబర్‌లో వీరిద్దరికి ఎంగేజ్ మెంట్ జరిగింది. సాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ప్రైవేట్ ఎస్టేట్ లో వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు 100 మందికి పైగా ముఖ్య అతిథులు హాజరైనట్లు తెలుస్తోంది. ఇద్దరికీ ఇది తొలి వివాహమే.

    ఇద్దరూ సంప్రదాయ పెళ్లి దుస్తువుల్లో తళుక్కుమన్నారు. అన్నా హాత్వే వాలెంటినో గౌన్లో అందంగా మెరిసి పోయింది. అన్నేహాత్వే, భర్త ఆడమ్ సుల్మన్ ఇప్పటికే శారీరకంగా కలిసారని, త్వరలో మొదటి బిడ్డకు జన్మనివ్వడానికి సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ఈ అధికారిక వార్తను తెలిపేందుకు గాను ఈ జంట వీరికి సంబంధించిన సన్నిహితులు, ఫ్యామిలీ ప్రెండ్స్ అందరిని గతంలోనే డిన్నర్‌కు ఆహ్వానించడం జరిగింది.

    అన్నేహాత్వే క్యాట్ ఉమెన్‌గా నటించిన ది డార్క్ నైట్ రైజెస్ అనే సినిమా ఇప్పటికే విడుదలై మంచి విజయం సాధించింది. గతంలో విడుదలై బాక్సాఫీసు రికార్డుల్ని సృష్టించిన 'బ్యాట్ మ్యాన్' సినిమాకు కొనసాగింపు చిత్రం ఇది. $250-300 మిలియన్ డాలర్ల వ్యయంతో రూపొందిన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద దాదాపు 1,067,288,231 డాలర్ల బిజినెస్ చేసింది.

    అన్నే హాత్వే తాను త్వరలో నటించనున్న 'లెస్ మిసరబెల్స్' చిత్రంలో సెక్స్ వర్కర్ పాత్రని పోషిస్తున్నారు. ఈ సెక్స్ వర్కర్ పాత్ర కోసం తన పొడవైన బ్రోన్ హెయిర్‌ని పాత్రకు తగ్గట్లుగా పొట్టిగా కత్తిరించుకునేందుకు సిద్దమైనట్లు హాలీవుడ్ వర్గాల సమాచారం. 'లెస్ మిసరబెల్స్' చిత్రంలో అన్నే హాత్వేతో పాటు హీరోగా ఆస్టేలియన్ హాగ్ జాక్స్ మెన్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అన్నే హాత్వే పోషిస్తున్న పాత్ర పేరు 'ఫాంటైన్'. తన బిడ్డకు ఆహారం పెట్టేందుకు డబ్బులు లేని పరిస్దితిలో వ్యవిఛార వృత్తిని ఎంచుకోని.. తన హెయిర్‌ని అమ్ముకునే పాత్రలో అన్నే హాత్వే నటిస్తున్నారు. హాగ్ జాక్స్ మెన్, అన్నే హాత్వేతో పాటు రస్సెల్ క్రో ఓ అధ్బుతమైన పాత్రలో కనిపించనున్నారు. ఈచిత్రం డిసెంబర్ 25, 2012న యూఎస్ లో, జనవరి 11, 2013లో యుకెలో విడుదల కానుంది.

    English summary
    Actress Anne Hathaway married fiance Adam Shulman at a wedding on the scenic coast of Big Sur, California, celebrity media reports said on Sunday. The couple became engaged last November and married on Saturday night before more than 100 invited guests, with Hathaway wearing a custom Valentino gown, People said. It was the first marriage for each.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X