ఆమె ప్రెగ్నెంట్.. అందుకే ఆ డిన్నర్ పార్టీ..!

By Nageswara Rao

లాస్ ఏంజిల్స్, జులై 16: హాలీవుడ్ స్టార్ హీరోయిన్ అన్నేహాత్వే, ఆమెకు కాబోయే భర్త ఆడమ్ సుల్మన్ త్వరలో మొదటి బిడ్డకు జన్మనివ్వడానికి సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ఈ అధికారిక వార్తను తెలిపేందుకు గాను ఈ జంట వీరికి సంబంధించిన సన్నిహితులు, ఫ్యామిలీ ప్రెండ్స్ అందరిని డిన్నర్‌కు ఆహ్వానించడం జరిగింది. అన్నే హాత్వే, ఆడమ్ సుల్మన్ ఈ వార్తను ప్రకటించగానే పార్టీ హాల్ మొత్తం చప్పట్లతో మారుమ్ర్మోగి పోవడమే కాకుండా.. పార్టీకి వచ్చిన అతిధులంతా అభినందనలు తెలియజేశారు.

ఈ డిన్నర్ పార్టీలో అన్నే హాత్వే, ఆడమ్ సుల్మన్ జంటతో పాటు వారి తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. ఇంత మంది రావడంతో ఈ పార్టీలో ఏదో మేజర్ న్యూస్ వెలువడుతుందని అనుకున్నట్లుగానే, అన్నే, ఆడమ్ ఎంతో సంతోషకరమైన వార్తను తెలియజేశారని అన్నే తల్లిదండ్రులు తెలిపారు. ఈ శుభవార్త విన్న సంతోషంలో అందరూ వైన్‌ని త్రాగగా.. అన్నే హాత్వే మాత్రం ఎటువంటి ఆల్కహాల్ తీసుకోలేదు.

ఈ డిన్నర్ పార్టీలో అందరూ ఈ జంటనే గమనించారు. ఎందుకంటే ఈ పార్టీలో వీరే ప్రత్యేక అతిధులు కాబట్టి. అన్నే హాత్వేని తదేకంగా చూసినట్లేతే ఆమె బొడ్డు మీద బేబి బంప్ ఉండడాన్ని గమనించిన ఓ అతిధి మాట్లాడుతూ వీరద్దిరికీ ఇది వరకే ఎంగేజ్‌మెంట్ అవడంతో ఇక త్వరలో మొదటి బిడ్డకు జన్మనివ్వడం.. ఈ పార్టీకి కారణం అని తెలిపాడు.

29 సంవత్సరాల వయసు కలిగిన అన్నే హాత్వే 2008 నుండి ఆడమ్ సుల్మన్‌తో డేటింగ్ చేస్తున్నారు. గత యేడాది నవంబర్‌లో వీరిద్దరికి ఎంగేజ్ మెంట్ ఫిక్స్ అయింది. ఎంగేజ్ మెంట్ ఫిక్స్ అయినప్పటికీ.. ఇంకా వివాహ తేదీని ఖరారు చేయలేదు. అన్నేహాత్వే క్యాట్ ఉమెన్‌గా నటించిన ది డార్క్ నైట్ రైజెస్ అనే సినిమా త్వరలో విడుదల కానుంది. గతంలో విడుదలై బాక్సాఫీసు రికార్డుల్ని సృష్టించిన 'బ్యాట్ మ్యాన్' సినిమాకు కొనసాగింపు చిత్రం ఇది. గతంలో ఈ పాత్రను క్రిస్టోఫర్ నోలన్ పోషించగా.. ప్రస్తుతం ఈ విలన్ పాత్రని అన్నే హాత్వే పోషిస్తున్నారు.

తెలుగు వన్ఇండియా

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X