ఎంగేజ్‌మెంట్ పార్టీ న్యూయార్క్‌లో ప్లాన్ చేశా..!

By Nageswara Rao

హాలీవుడ్ ఏంజిల్ 'అన్నే హాత్వే' మొన్న శనివారం తన చిరకాల డేటింగ్ బాయ్ ప్రెండ్ ఆడమ్ సుల్మన్‌తో 125 మంది గెస్టుల సమక్షంలో మాన్‌హాట్టన్‌లో ఉన్న 'హౌసింగ్ వర్క్స్ బుక్ స్టోర్ కేఫ్' ఎంగేజ్ మెంట్ కార్యక్రమం హాట్టహాసంగా జరిగింది. 2008వ సంవత్సరం నుండి కూడా వీరిద్దరి మద్య జరుగుతున్న డేటింగ్ వ్యవహారానికి మొన్నటితో బ్రేక్ పడింది.

వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌కు వచ్చిన అతిధిలకు, స్నేహితులకు.. ఫ్యామిలీ సన్నిహితులకు పార్టీ మాత్రం న్యూయార్క్‌లో ప్లాన్ చేసినట్లు అన్నే హాత్వే తెలిపారు. ఈ సందర్బంలో అన్నే హాత్వే మాట్లాడుతూ నేను ఆడమ్ సుల్మన్ గత ఐదు సంవత్సరాలుగా ప్రేమలో మునిగితేలుతున్నాం. అతనంటే నాకు చెప్పలేనంత ప్రేమ. ఐతే మొదట మేమిద్దరం సింగిల్ గానే ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ ఆ ప్లాన్ మాత్రం సక్సెస్ కాలేదంటూ నవ్వుతూ అన్నారు.

29 సంవత్సరాల వయసు కలిగిన అన్నే హాత్వే ఎప్పుడూ కూడా తన ప్రేమని బయటకు ఆడమ్ సుల్మన్‌తో వ్యక్త పరచలేదని అన్నారు. ఐతే మా ఇద్దరి అభిరుచులు ఒకే విధంగా ఉండండంతో మా మనసులు కలిశాయని అన్నారు. మేము చాలా సంవత్సరాలుగా కలసి ఉన్నాం.. అది తలచుకుంటూనే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని జంటలు మాత్రం అలా కాదు.. డేటింగ్, రొమాన్స్ అంటూ మోజు తీరగానే విడిపోతారు.

మొదట్లో నేను ఆడమ్ సుల్మన్‌ని కలసినప్పుడు నేను అతనికి గర్ల్ ప్రెండ్ ఉందని అనుకోవడం.. తాను కూడా నాకు బాయ్ ప్రెండ్ ఉన్నాడని అనుకోవడంతో మేమిద్దరం మనసు విప్పి మాట్లాడుకోవడానికి చాలా రోజులు పట్టిందని అలనాటి సంగతులను షేర్ చేసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X