twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లెస్బియన్ ఆంటీగా నటించడానికి సిద్దమైన హీరోయిన్

    By Nageswara Rao
    |

    ఆదివారం లాస్ ఏంజిల్స్ లో జరిగినటువంటి గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో హిట్ టివి సిరిస్ 'గ్లీ' షో నిర్మాత రేయన్ ముర్పే డేవిల్ వీర్స్ ప్రాదా సినిమా స్టార్ హీరోయిన్ అన్నే హాత్వే‌ని కలవడం జరిగింది. హాలీవుడ్ సీరిస్‌లలో గ్లీ అనే షోది ప్రత్యేక స్దానం. స్వతహాగా అన్ని సింగింగ్ మరియు డాన్సింగ్ ప్రోగ్రామ్‌లకు మంచి ప్యాన్ అయినటువంటి అన్నే హాత్వే గతంలో కూడా గ్లీ షోలో క్రిస్ కోల్పోర్ గే క్యారెక్టర్ కుసంబంధించి రిలటివ్‌గా ఆంటీ(కుర్ట్ హమ్మెల్) నటించడానకి ఒప్పుకున్న కొన్ని అనివార్యకారణాల వల్ల అది జరగలేదు.

    ఈసారి మాత్రం లాస్ ఏంజిల్స్ లో జరిగినటువంటి గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో షో నిర్మాత రేయన్ ముర్పే ఆపాత్రకు అన్నే హాత్వేని అడడగానే ఒప్పుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని రేయన్ ముర్పే యాక్సెస్ హాలీవుడ్‌‌కి వివరిస్తూ ఇది నిజంగానే నిజం. అవార్డుల కార్యక్రమంలో అన్నే హాత్వే మేము కూర్చున్నటువంటి టేబుల్ దగ్గరకు వచ్చిమరీ తన అంగీకారాన్ని తెలియజేశారు. గ్లీ షోలో ఉన్నటువంటి క్రిస్ కోల్పోర్ కుసంబంధించినటువంటి లెస్బియన్ ఆంటీగా నేను నటించడానికి సిద్దంగా ఉన్నానని అన్నారు. దాంతో నాకు ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. దానినుండి తేరుకోని మీరు నిజంగానే ఆక్యారెక్టర్ చేయడానికి సిద్దంగా ఉన్నారా అని అడిగాను. దానికి ఆమె నేను చేస్తున్నానునంటూ తన అంగీకారాన్ని తెలిపారు.

    దీనిని బట్టి చూస్తుంటే గ్లీ షోలో అన్నే హాత్వే పాల్గోనబోతున్నారన్నమాట. అన్నే హాత్వేకి సంబంధించినటువంటి ఎపిసోడ్స్ నినెలరోజులలో తీయడం జరుగుతుందని షో నిర్మాత రేయన్ ముర్పే తెలిపారు. ఈసందర్బంలో అన్నే హాత్వే మాషోలో పాల్గోంటున్నందుకు మాఆనందాన్నితెలియజేస్తున్నామన్నారు. అంతేకాకుండా అన్నే హాత్వేకు చాలా ఐడియాస్ ఉంటాయని అఐడియాస్ అన్ని మాషోలో ఉపయోగించుకోనున్నామని ఆయన అన్నారు.

    English summary
    Anne Hathaway may soon appear on hit TV series ‘Glee’. The show's creator Ryan Murphy approached the ‘Devil Wears Prada’ star and offered her a role in the show at the Golden Globes on Sunday. The actress is a longtime fan of the all-singing, all-dancing programme, and last year (10) revealed she wants to play a long lost relative of Chris Colfer's gay character Kurt Hummel. Hathaway's suggestion has now been accepted by Murphy, who agreed to let the actress appear in the show when he saw her at the award ceremony in Los Angele.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X