Ant-Man and The Wasp: Quantumania భారీగా అడ్వాన్స్ బుకింగ్.. RRR గ్రేట్ మూవీ: జోనాథన్

మార్వెల్ స్టూడియోస్ తాజా చిత్రం యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమేనియా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమైంది. ఇండియాలో భారీగా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైనట్టు మార్వెల్ స్టూడియోస్ ఇండియా తన అధికారిక ట్విట్టర్ పేజ్‌ ద్వారా వెల్లడించింది. యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమేనియా అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ఇండియాలో బుక్‌మైషో, పేటీయం ద్వారా మీ టికెట్లు బుకింగ్ చేసుకోండి అని ట్వీట్‌లో పేర్కొన్నది.

Ant-Man and The Wasp: Quantumania

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఐదో సీక్వెల్‌కు పీటన్ రీడ్ దర్శకత్వం వహిస్తున్నారు. యాంట్ మ్యాన్, వాస్ప్ పాత్ర్లోకి స్కాట్ లాంగ్ (రుడ్), హోప్ వాన్ డైన్ (లిల్లీ)గా మళ్లీ ప్రేక్షకుల ముందుకు తిరిగి వస్తున్నారు.

యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమేనియా ఫేమ్ జోనాథన్ మేజర్స్ ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఇండియాలో ఈ వారం రిలీజ్ అవుతున్నది. అప్పుడే అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో కొత్త అనుభూతిని పొందడానికి కొద్ది రోజులే ఇక మీ ముందు ఉంది అని అన్నారు.

యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమేనియా రిలీజ్‌కు భారతీయ సినిమాల గురించి జోనాథన్ మేజర్స్ మాట్లాడుతూ.. నేను భారతీయ సినిమాలు చూస్తుంటాను. RRR సినిమా చూశాను. క్యాంగ్ ది కాంకర్ దృష్టిని ఎస్ఎస్ రాజమౌళి ఆకర్షించారు. RRR సినిమాను ఒక్కసారి కాదు.. చాలాసార్లు చూశాను. మూడు గంటలపాటు కొత్త అనుభూతిని పొందాను. ఎన్టీఆర్, రాంచరణ్ నటన అద్బుతంగా ఉందని ప్రశంసల వర్షం కురిపించారు. భారతీయ సినిమాలు చూడమని చాలా మందికి చెబుతుంటాను. ఇండియన్ సినిమాలు అంతర్జాతీయ ప్రేక్షకులపై ప్రభావం చూపుతున్నాయి అని జోనాథన్ అన్నారు.

కెవిన్ ఫీజ్, స్టీఫాన్ బ్రౌసార్డ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 17వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా కోసం భారీగా భారతీయ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X