For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇస్లాం వ్యతిరేక ఫిల్మ్ నిర్మాత అరెస్టు

    By Bojja Kumar
    |

    లాస్ ఏంజిల్స్ : వివాదాస్పద ఇస్లాం వ్యతిరేక చిత్రం 'ఇన్నోసెన్స్‌ ఆఫ్‌ ముస్లిం'పై ప్రపం చంలోని ఇస్లాం లోకం మొత్తం భగ్గమంటున్న సంగతి తెలిసిందే. ఎంకి పెళ్లి సుబ్బిచా వుకొచ్చిందన్నట్లు ఒక ఆమెరికన్‌ తయారు చేసిన వివాదాస్పద చిత్రం అమెరికా సర్కా రుకు ఇరకాటంగా మారింది. లిబియాలో అయితే ఏకంగా అమెరికా రాయబార కార్యాలయంపై దాడి చేసి రాయబారిని కూడా చంపేసారు. ఈచిత్రంలో నటించిన వారు ఇప్పుడు అర చేతిలో ప్రాణాలు పట్టుకుని బిక్కుబిక్కుమనే పరిస్థితి నెలకొంది.

    ఈ పరిస్థితులకు కారణం మహ్మద్ ప్రవక్తను కించపరుస్తూ ఈ సినిమా ఉండటమే. తాజాగా ఈచిత్ర నిర్మాత నకోలాను లాస్ ఏంజిల్ పోలీసులు అరెస్టు చేసారు. ఆయన్ను కోర్టులో ప్రవేశ పెట్టగా న్యాయమూర్తి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు. నకోలాపై గతంలోనూ నేరారోపణలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

    ఈచిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన నటి అనాగుర్జీ తను ప్రాణభయంతో గడుపుతున్నానని 'డెయిలీ మెయిల్‌'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయింది. చిత్ర దర్శకుడు నకోలా బాసెలీ నకోలా 'వ్యాం బేసిల్‌) తనను ఏమార్చి ఇందులో జార్జ్‌ అనే పాత్ర సరసన హిలార్‌ అన బాలవధువు పాత్రకు ఒప్పించినట్లు ఆమె ఆరోపించింది.తనకు పాత్ర వివరాలు పూర్తిగా వెల్లడించలేదని, దర్శకుడు తనను మోసగించాడని, ఇప్పుడు తాను ఇంటికే పరిమితమై భయంతో కాలం గడుపుతున్నానని, ప్రాచీన పశ్చిమాసియా ప్రాంతంలో భూమిపై తోకచుక్కపడిన అంశానికి సంబంధించిన ఈ చిత్రాన్ని యాక్షన్‌ చిత్రంగానే తాను భావించానని, ఇందులో ఉన్న రహస్య ఎజెండా గురించి తనకు తెలియదని చెప్పింది.

    ప్రపంచ వ్యాప్తంగా యు.ఎస్‌ కాన్సులేట్లపై దాడులు కారణమైనలకు ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన అమెరికన్‌ దర్శకుడు శ్యాంబేసిల్‌ ప్రస్తుతం అజ్ఞాత జీవితాన్ని గడపుతున్నారు. ఈయన తన మనోభావాలను ప్రపంచానికి తెలపాలని ఓ ప్రముఖ వార్తా పత్రికకు సందేశం పంపించాడు. తను ముస్లీం మత పత్రికకు సందేశం పంపిస్తూ. తాను తీసిన చిత్రం అంతం కాదు ఆరంభం మాత్రమేనని, మున్ముందు మరెన్నో ముస్లిం వ్యతిరేక చిత్రాలకు దర్శకత్వం వహించనున్నట్టు ప్రకటించారు.

    English summary
    Nakoula Basseley Nakoula, the producer who helped make the anti-Islam movie The Innocence of Muslims, has been arrested in Los Angeles. Apparently the 55-year-old was taken into custody for a parole violation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X