రివ్యూలు 'ఛీ' కొట్టినా.. ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు
అవతార్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు శ్యామ్ వర్తింగ్టన్ నటించిన తాజా సినిమా క్లాష్ ఆఫ్ ది టైటాన్స్. 1981లో వచ్చిన సైంటిఫిక్ మూవీ క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ సినిమాను అదే పేరుతో రీమేక్ చెయ్యబడ్డ ఈ సినిమా గత శుక్రవారం(ఏప్రిల్ 2న) విడుదలయింది. పాత సినిమాతో పోల్చితే ఈ సినిమా విషయం లేదని రివ్యూలు ఈ సినిమాను ఛీ కొట్టాయి. దీంతో ఈ సినిమా ఫ్లాప్ లిస్ట్ లో చేరిపోతుందని కూడా వారు జోస్యం చెప్పారు.
కానీ ఇప్పుడు పరిస్థితి అనుకున్నదానికి విరుధ్దంగా వుంది. అమెరికా బాక్సాఫీసు వద్ద ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతోంది. 2డి, 3డి వెర్షన్ లలో విడుదలయిన ఈ సినిమా 61.4 మిలియన్ డాలర్ల వసూలు చేసి బాక్సాఫీసు వద్ద తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాతి స్థానంలో 30.2 మిలియన్ డాలర్ల వసూళ్లతో 'వై డిడ్ ఐ గెట్ మ్యారీడ్ టూ?' సినిమా నిలిచింది.
బాక్సాఫీసు వద్ద తొలి 5 స్థానాల్లో నిలిచిన చిత్రాల వివరాలు ఇలా వున్నాయి:
1. క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ ---- 61.4 మిలియన్ డాలర్లు
2. వై డిడ్ ఐ గెట్ మ్యారీడ్ టూ? ---- 30.2 మిలియన్ డాలర్లు
3. హౌటు ట్రెయిన్ యువర్ డ్రాగన్ ---- 29.2 మిలియన్ డాలర్లు
4. ది లాస్ట్ సాంగ్ ---- 16.2 మిలియన్ డాలర్లు
5. అలైస్ ఇన్ వండర్ ల్యాండ్ ---- 8.3 మిలియన్ డాలర్లు


Click it and Unblock the Notifications











