twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అబ్బుర పరుస్తున్న మేకింగ్ వీడియో: అన్ని సినిమాలను కొట్టేస్తుందా?

    |

    స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాంటి సూపర్ హీరోల సినిమాలు చూసి బోర్ కొట్టేసిన సినీ అభిమానులను త్వరలో 'ఆక్వామ్యాన్' తన సరికొత్త విన్యాసాలతో ఆశ్చర్యంలో ముంచెత్తబోతున్నాడు. గతంలో కొన్ని హాలీవుడ్ సూపర్ హీరోస్ సినిమాల్లో ఆక్వామ్యాన్ పరిచయం అయినప్పటికీ 'ఆక్వామ్యాన్' ప్రధానంగా సినిమా రాలేదు.

    వచ్చే క్రిస్మస్ సీజన్లో... ప్రపంచ సినీ ప్రేక్షకులను సిరికొత్త లోకంలోకి తీసుకెళ్లేందుకు డిసెంబర్ 21న ఈ సముద్రపు సూపర్ హీరో థియేటర్లలోకి వస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. తాజాగా బిహైండ్ ది సీన్స్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.

    ఊహకందని ప్రపంచంలోకి...

    జేమ్స్‌ వాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఊహకందని ఓ కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లబోతోంది. జేసన్‌ మొమోవా ఈ చిత్రంలో ‘ఆక్వామ్యాన్' పాత్రను పోషించారు. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ కీలక పాత్ర పోషించనున్నాయి.

    ఈ 5 నిమిషాల వీడియోలో అబ్బుర పరిచే సన్నివేశాలు

    సినిమా ప్రమోషన్లో భాగంగా 5 నిమిషాల వీడియో ఒకటి కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఈ వీడియో రిలీజైన తర్వాత ‘ఆక్వామ్యాన్' సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటి వరకు హాలీవుడ్లో వచ్చిన యాక్షన్ సినిమాలకు భిన్నంగా ‘ఆక్వామ్యాన్' ఉండటమే ఇందుకు కారణం.

    ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాలను కొట్టేస్తుందా?

    ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాలను కొట్టేస్తుందా?

    అప్పట్లో ‘అవతార్' సినిమా విడుదలైనపుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా రికార్డులన్నీ బద్దలయ్యాయి. ఇపుడు ‘ఆక్వామ్యాన్' కూడా అవతార్ తరహాలో ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    రూ. 1150 కోట్ల బడ్జెట్

    రూ. 1150 కోట్ల బడ్జెట్

    ‘ఆక్వామ్యాన్' చిత్రాన్ని రూ. 1150 కోట్ల పైచిలుకు బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతోంది. ఇండియాలో ఇంగ్లిష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళ వెర్షన్లు కూడా విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    English summary
    AQUAMAN – Behind the Scenes Released. The three-minute clip gave unprecedented insight into the Village Roadshow Studios set of the $221 million superhero blockbuster, which filmed across southeast Queensland last year — including at Currumbin Beach, The Spit, North Stradbroke Island and Hastings Point in northern NSW.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X