ఊహించలేదు: ఫస్ట్ వీకెండ్ రూ. 670 కోట్ల వసూలు,బాక్సాఫీస్ షేకింగ్!
ఆక్వామ్యాన్... కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం. అమెరికా, ఇండియా కంటే ముందే ఈ చిత్రం చైనాలో విడుదలైంది. డిసెంబర్ 7న డ్రాగన్ దేశపు థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఓపెనింగ్స్ పరంగా అదరగొట్టింది.
డిసెంబర్ మాసంలో చైనాలో హయ్యెస్ట్ టోటల్ సాధించిన చిత్రంగా 'ఆక్వామ్యాన్' రికార్డులకెక్కింది. డిసెంబర్ 7న విడుదవ్వగా తొలి 3 రోజుల్లో 93.6 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంటే దాదాపు రూ. 670 కోట్లు.

ఆక్వామ్యాన్
జేమ్స్ వాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఊహకందని ఓ కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లబోతోంది. జేసన్ మొమోవా ఈ చిత్రంలో ‘ఆక్వామ్యాన్' పాత్రను పోషించారు. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను అబ్బురపరచున్నాయి.

బడ్జెట్ ఎంతో తెలుసా?
‘ఆక్వామ్యాన్' చిత్రాన్ని రూ. 1150 కోట్ల పైచిలుకు బడ్జెట్‌తో తెరకెక్కించారు. ప్రముఖ హాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతోంది.

అమెరికాలో భారీ డిమాండ్
అమెరికాలో ఆక్వామ్యాన్ చిత్రం డిసెంబర్ 21న విడుదల కాబోతోంది. యూఎస్ఏలో నెల రోజుల ముందే ఈ మూవీ టిక్కెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. రిలీజ్ ముందే అత్యధికంగా టికెట్స్ అమ్ముడు పోయిన రికార్డ్ మొన్నటి వరకు ‘అవేంజర్స్-ఇన్ఫినిటీవార్' పేరుతో ఉండగా... ఇపుడు ఆ రికార్డును ‘ఆక్వామ్యాన్' బద్దలు కొట్టింది.

ఇండియాలో డిసెంబర్ 14న...
ఇండియాలో ఇంగ్లిష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళ వెర్షన్లు కూడా విడుదల చేస్తున్నారు. తెలుగు వెర్షన్‌కు ‘సముద్ర పుత్రుడు' అనే టైటిల్ ఫైనల్ చేశారు. డిసెంబర్ 14న ఈ చిత్రం భారతీయ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











