విడుదలకు నెల రోజుల ముందే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది!
హాలీవుడ్ నుంచి మరో భారీ యాక్షన్ మూవీ 'ఆక్వామ్యాన్' ఈ క్రిస్మస్ సీజన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ మూవీ విడుదలకు నెల రోజుల ముందే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టడం చర్చనీయాంశం అయింది.
యూఎస్ఏలో నెల రోజుల ముందే ఈ మూవీ టిక్కెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. రిలీజ్ ముందే అత్యధికంగా టికెట్స్ అమ్ముడు పోయిన రికార్డ్ మొన్నటి వరకు 'అవేంజర్స్-ఇన్ఫినిటీవార్' పేరుతో ఉండగా... ఇపుడు ఆ రికార్డును 'ఆక్వామ్యాన్' బద్దలు కొట్టింది.

'అక్వామ్యాన్' చిత్రాన్ని డిసెంబర్ 15న దాదాపు 1000 లొకేషన్లలో అడ్వాన్స్ స్క్రీనింగ్ వేస్తున్నారు. ఇందుకోసం అమ్మకానికి టిక్కెట్లు పెట్టగా భారీ సంఖ్యలో అమ్ముడయ్యాయి. సినిమా రిలీజ్ ముందే ఇలా ఉందంటే... రిలీజ్ తర్వాత ఇంకెన్నిరికార్డులు బద్దలు కొడుతుందో?
జేమ్స్ వాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఊహకందని ఓ కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లబోతోంది. జేసన్ మొమోవా ఈ చిత్రంలో 'ఆక్వామ్యాన్' పాత్రను పోషించారు. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ కీలక పాత్ర పోషించనున్నాయి.
'ఆక్వామ్యాన్' చిత్రాన్ని రూ. 1150 కోట్ల పైచిలుకు బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతోంది. ఇండియాలో ఇంగ్లిష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళ వెర్షన్లు కూడా విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











