మరో ప్రతిష్టాత్మక హాలీవుడ్ చిత్రానికి ఎఆర్ రెహమాన్...!!
ఆస్కార్ అవార్డు విజేత, భారతీయ మ్యూజిక్ మాంత్రికుడు ఎఆర్ రెహమాన్ మరో ప్రతిష్టాత్మక హాలీవుడ్ చిత్రానికి సన్నద్ధమవుతున్నాడు. డ్యాన్స్ కాంపిటీషన్ ను ఇతివృత్తంగా తీసుకుని నిర్మిస్తున్న 'స్ట్రీట్ డాన్సింగ్' అనే చిత్రానికి ఆయన ఇంగ్లీషు సంగీత దర్శకుడు డేవిడ్ ఎ. స్టివార్ట్ తో కలసి సంయుక్తంగా ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నాడు. బిల్లీ వుడ్ రూఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'అమెరికన్ డ్రీమ్స్' ఫేం డేవిడ్ బి. హ్యారిస్ స్క్రిప్ట్ ను అందిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో సిండీ గోమెజ్ నటిస్తున్నాడని సమాచారం.
'స్లమ్ డాగ్ మిలియనీర్' సినిమాతో ఆస్కార్ అవార్డు పొందటమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రెహమాన్ ఈ సినిమాతో వెస్ట్రన్ సంగీతానికి, ఇక్కడి ప్రేక్షకులకు దగ్గర చెయ్యాలని ప్రయత్నిస్తున్నట్టు, ఈ సినిమాతో తన కల తీరబోతున్నట్టు తెలిపారు. 'మోజార్ట్ ఆఫ్ మద్రాస్' అని పిలువబడుతున్న రెహమాన్ ఈ సినిమాతో మరింత మంది అభిమానాన్ని పొందాలని ఆశిద్దాం....!!


Click it and Unblock the Notifications











