ఆరియాలిటీ షోలో ఆయన లేని వెలితిని ఆడియన్స్ మిస్ అవుతున్నారా?..
అమెరికన్ ఐడియల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటటువంటి రియాలిటీ టివి షో. గతంలో ఈషోలో మంచి వ్యాఖ్యాతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించికున్నటువంటి సైమన్ కోవెల్ ఈసారి షోలో లేకపోవడం వల్ల ఆవెలితి పూర్తిగా కనిపించిందని అమెరికా అభిమానులు వారియొక్క భావాలను పంచుకున్నారు. సైమన్ కోవెల్ జడ్జిగా వ్యవహారించేటటువంటి ఈ అమెరికన్ ఐడియల్ షోని ఎంతో కష్టపడి నెంబర్ వన్ స్దానానికి తీసుకెళ్శారు. కొన్ని అనివార్య కారణాల వల్ల సైమన్ కోవెల్ ఈ షో నుండి వెళ్శి అమెరికా వర్సన్ ఎక్స్ ప్యాక్టర్ షోలో పాల్గోనడం జరిగింది.
సైమన్ కోవెల్ షోలో లేకపోవడం వల్ల టివి రేటింగ్స్ గత సంవత్సరంతో పోల్చుకున్నట్లైతే 13శాతం తగ్గాయని యాజమాన్యం చెపుతున్నారు. చివరి వారం జరిగినటువంటి షోలో షోని చూసే వారి శాతం కూడా బాగా తగ్గిందని సమాచారం. దీనికి గాను షో ఎక్ప్ ఫర్ట్‌ల వివరాల ప్రకారం షోలో మిస్టర్ న్యాస్టీ, సైమన్ కోవెల్ లేని లోటు పూర్తిగా తెలిసిపోతుందని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి అమెరికన్ ఐడియల్‌లో జెన్నిఫర్ లోపెజ్, ఏరోస్మిత్ స్టీవెన్ టేలర్ లతోపాటుగా ర్యాండీ జాక్సన్‌లు జడ్జిలుగా వ్యవహారిస్తున్న విషయం అందరికి తెలిసిందే.
సైమన్ కోవెల్ జడ్జిగా వ్యవహారించేటటువంటి తీరు అందరిని బాగా ఆకట్టుకుంటుందని, అలాంటి కటింగ్ అతను లేకపోవడం అది మిస్సవుతుందని యాజమాన్యం వారు భావిస్తున్నారు. ఏది అయితే ఏమి మరలా అమెరికన్ ఐడియల్‌కు తిరిగి పూర్వవైభవం తెస్తామని ప్రస్తుతం ఉన్నటువంటి జడ్జిలు మాటలు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











