స్నేహితులు, బంధువులకు తల్లి కాబోతున్నవిషయాన్నిచెప్పిన టెన్నిస్ స్టార్
సెక్సీ స్పానిష్ సింగర్ ఎన్రిక్ మరియు టెన్నిస్ స్టార్ అన్నా కొర్నికోవా 2001వ సంవత్సరం నుండి డేటింగ్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వీరిద్దరి రోమాన్స్ గురించి చాలా సార్లు పత్రికలలో వార్తలు చదివాం. ఐతే ఇప్పుడు కొత్తగా వీరిద్దరి గురించి మరో వార్త గుప్పుమంటుంది. ఇంతకీ ఏమిటీ వార్త అనుకుంటున్నారా.. ఎన్రిక్ మరియు అన్నా కొర్నికోవా త్వరలోనే మొదటి బేబిని బాహ్యాప్రపంచంలోకి ఆహ్వానించనున్నారని సమాచారం.
అన్నా కొర్నికోవా మొట్టమొదట మనం తలచుకోగానే మనకు గుర్తుకు వచ్చేది ఆమె ఫిజిక్ మాత్రమే. కానీ ప్రస్తుతం అన్నా కొర్నికోవా తన అందాన్ని పూర్తిగా కప్పుకోని తన ఫిజిక్ కనపడంకుండా జాగ్రత్త పడడం ఈమద్య చూశాం. దీనికి అంతటికి కారణం తాను ప్రగ్నెన్సీ ధరించడమేనని అంటున్నారు ఆమె సన్నిహితులు. తనకు పెరుగుతున్నటువంటి బేబి బంప్‌ని కవర్ చేయడం కోసమే అలాంటి దుస్తులు ధరిస్తున్నారని అన్నారు.
అన్నా కొర్నికోవా ప్రగ్నెన్సీ ధరించినటువంటి విషయాన్ని ఇటీవలే తన స్నేహితలు మరియు మిత్రులతో మియామి మాన్సన్‌లో పంచుకున్నట్లు ఓ పత్రికలో వార్తాకధనాన్ని ప్రచురించడం జరిగింది. అంతేకాకుండా త్వరలోనే ఈవిషయాన్ని పబ్లిక్‌గా ఎనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


Click it and Unblock the Notifications











