వరుస డేటింగ్‌లతో హాల్ చల్ చేస్తున్న రాపర్...!
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ రాపర్ డ్రేక్.. సూపర్ మోడల్ టైరా బ్యాంక్స్ ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారని సమాచారం. కాలిఫోర్నియాలో ఉన్న డిస్నీ ల్యాండ్‌లో వీరిద్దరూ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఇక డ్రేక్ పూర్తి పేరు ఆబ్రే గ్రాహాం. సూపర్ మోడల్ టైరా బ్యాంక్స్ తో థీమ్ పార్క్ లో వీళ్లిద్దరూ చేసిన హాడావుడి అంతా ఇంతా కాదని ఓ ప్రముఖ వెబ్ సైట్ కథనం ప్రచురించింది.
వీరిద్దరూ థీమ్ పార్క్ లో నవ్వుకుంటూ.. ఎంజాయ్ చేస్తుండగా, ఓ ప్రముఖ వెబ్ సైట్‌కు చెందిన అభిమాని వీరి ఫోటోని తీయడంతో వీరి మధ్యనున్న డేటింగ్ వ్యవహారం బయట పడింది. గతంలో రాపర్ డ్రేక్ పాప్ సింగర్ రిహానాతో మాత్రమే కాకుండా.. నికీ మినాజ్, మ్యూజిక్ సెన్షేషన్ రిటా ఓరాలతో డేటింగ్ చేశాడు. కొన్ని మనస్పర్దల రావడంతో వీరి నుండి విడిపోయాడు.
ఇది ఇలా ఉంటే సూపర్ మోడల్ టైరా బ్యాంక్స్ బిజినెస్ మ్యాన్ ఉటున్ధల్ తో ఇటీవలే తెగతెంపులు చేసుకోని రాపర్ డ్రేక్ తో చెట్టాపట్టాలేసుకోని తిరుగుతుంది.


Click it and Unblock the Notifications











