మరలా తిరిగి సినిమాలలో నటించడానికి సిద్దం అంటున్న సూపర్ స్టార్
ఆర్నాల్డ్ స్వార్జ్‌నెగ్గర్ ఓ యాక్టర్, ఓ మోడల్, ఓ పోలిటీషియన్ ఇలా ఆయన గురించి మనం చాలా చెప్పుకోవచ్చు. ఆయన నటించినటువంటి టెర్మినేటర్ ఆయనకి ఎంత పేరు తెచ్చిపెట్టిందో యావత్ ప్రపంచం మొత్తానికి తెలుసు. ఓ యాక్టర్ కంటే కూడా ఆర్నాల్డ్ స్వార్జ్‌నెగ్గర్ కాలిఫోర్నియా రాష్ట్రానికి గవర్నర్ గాబాగా సుపరిచితం. కాలిఫోర్నియా రాష్ట్రానికి గవర్నరైన తర్నాత ఆర్నాల్డ్ స్వార్జ్‌నెగ్గర్ సినిమాలలో నటించడం బాగా తగ్గించారు. దానికి కారణం రాజకీయ బాద్యతలకు మరియు సినిమాలకు లింకు కుదరక పోవడమే. కానీ ఎన్నో రోజులనుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్నాల్డ్ స్వార్జ్‌నెగ్గర్ అభిమానులకు ఓ శుభవార్త.
త్వరలో ఆయన ఓ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. ఈవిషయాన్ని స్వయంగా ఆర్నాల్డ్ స్వార్జ్‌నెగ్గర్ ఒప్పుకోవడం విశేషం. ఈసందర్బంగా ఆర్నాల్డ్ స్వార్జ్‌నెగ్గర్ మాట్లాడుతూ ప్రస్తుతం నేను మూడు స్కిప్ట్స్‌ని వినడం జరుగుతుందని అన్నారు. ఈ అరవై మూడు సంవత్సరాల పాత సూపర్ స్టార్ ప్రస్తుతానికి నావయసుకి సంబంధించినటువంటి రోల్స్ వేయడానికి సిద్దంగా ఉన్నానని తెలియజేశారు. ప్రస్తుతానికి కధాచర్చలు జరుగుతున్నాయి. తను రాబోయే సినిమాలలో గతంలో మాదిరి విన్యాసాలు ఉన్నా లేకపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. డైరెక్టర్ క్లెయింట్ ఈస్ట్‌వుడ్ అదే పనిలో బిజీగా ఉన్నారు. ఏది ఏమైనా కానీ గతంలో నాసినిమాలలో ఉన్నటువంటి పైట్లు మాత్రం సాధ్యంకాకపోవచ్చునని అన్నారు. ఏది ఏమైతేనేం త్వరలో మరలా మాఅభిమాన సూపర్ స్టార్ మరలా తిరిగి సినిమాలలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











