»   » మళ్శీ తెరపై కనిపించడానికి సిద్ధమవుతున్న ఒకప్పటి స్టార్ హీరో..!

మళ్శీ తెరపై కనిపించడానికి సిద్ధమవుతున్న ఒకప్పటి స్టార్ హీరో..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆర్నాల్డ్‌ స్వార్జ్‌నెగ్గర్ ఓ యాక్టర్, ఓ మోడల్, ఓ పోలిటీషియన్ ఇలా ఆయన గురించి మనం చాలా చెప్పుకోవచ్చు. ఆయన నటించినటువంటి టెర్మినేటర్ ఆయనకి ఎంత పేరు తెచ్చిపెట్టిందో యావత్ ప్రపంచం మొత్తానికి తెలుసు. ఓ యాక్టర్ కంటే కూడా ఆర్నాల్డ్‌ స్వార్జ్‌నెగ్గర్ కాలిఫోర్నియా రాష్ట్రానికి గవర్నర్ గాబాగా సుపరిచితం. కాలిఫోర్నియా రాష్ట్రానికి గవర్నరైన తర్నాత ఆర్నాల్డ్‌ స్వార్జ్‌నెగ్గర్ సినిమాలలో నటించడం బాగా తగ్గించారు. దానికి కారణం రాజకీయ బాద్యతలకు మరియు సినిమాలకు లింకు కుదరక పోవడమే.

ఈ 63సంవత్సరాల వయసు గల ఆర్నాల్డ్‌ స్వార్జ్ ‌నెగ్గర్ ఇటీవల కాలంలో గవర్నర్ జాబ్ కిఒక వారం సెలవు పెట్టి టెర్మినేటర్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ నికలవడం జరగిందంట. ఆర్నాల్డ్‌ స్వార్జ్‌నెగ్గర్ జేమ్స్ కామెరూన్ కలవడం వెనుక ఏదో విశేషం ఉంది అనుకుంటున్నారు ఆయన అభిమానులు. త్వరలో వీరిద్దరి కలయికలో మరో కొత్త చిత్రం రాబోతుందని హాలీవుడ్ వర్గాల బోగట్టా.

దీనికి సంబందించి ఆర్నాల్డ్‌ స్వార్జ్‌నెగ్గర్ మూడు నెలలు సమయం డైరెక్టర్ కికేటాయించినట్టు, ఇప్పటికి కూడా నేను చాలా ఓపికగా సెట్ లోకూర్చోవడానికి సిద్దంగా ఉన్నాని తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం తాను గవర్నర్ గాఉన్నప్పుడు ఇచ్చినటువంటి స్పీచెస్ గురించి ఒక పుస్తకం కూడా రాయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రాజకీయాల్లోకి వెళ్శిన తర్వాత సినిమా ఇండస్టీ మీద ఆర్నాల్డ్‌ స్వార్జ్‌నెగ్గర్ పట్టుని కోల్పోయారని కోంత మంది సినీ విశ్లేషకులు అనడం హాస్యాస్పదంగా ఉందని అయన అన్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఇటీవల కాలంలో సిల్వస్టర్‌ స్టాలోన్ దర్శకత్వం వహించినటువంటి ఎక్స్ పెండబుల్స్ చిత్రంలో నటించిన విషయం అందరికి తెలిసిందే..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu