శత్రువులని మిత్రులు గా మార్చిన సినిమా..!!
హాలీవుడ్ మాజీ శత్రువులు సిల్వస్టర్ స్టాలోన్, ఆర్నాల్డ్ స్వార్జ్ నెగ్గర్ స్నేహితులైపోయారు. సిల్వస్టర్ స్టాలోన్ తీస్తున్న 'ఎక్స్ పెండబుల్స్' చిత్రంలో ఆర్నాల్డ్ నటిస్తున్నాడు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి గవర్నరైన ఆర్నాల్డ్ చాలా సంవత్సరాల సంత్సరాల తర్వాత ఓ సినిమాలో కనిపించబోతున్నాడు. నటులుగా స్టాలోన్, ఆర్నాల్డ్ ..ఇద్దరూ సినిమాల్లోనూ, బయటా శత్రువుల్లా మెదిలేవారు. మళ్లీ అదే సినిమా వీరిద్దర్ని స్నేహితులుగా మార్చింది. 'అతను నా బెస్ట్ ఫ్రెండ్. గత సాన్నిహిత్యానికి ఇదొక భిన్నరూపం. ఇప్పటికీ అతను నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తాడు. అయినప్పటికీ అతన్ని చూస్తున్నాను. ప్రపంచంలో ఇలాంటి వారు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. గతంలో నేను ప్రవర్తించిన విధానాన్నే అతను ఇప్పటికీ కోరుతున్నాడు. కానీ అది సాధ్యం కాదని చెప్పా. గతంలో ఆర్నాల్డ్ పిచ్చివాడిగా ప్రవర్తించేవాడు' అని తెలుపుతున్నాడు స్టాలోన్.
ఇక సినిమా విషయానికి వస్తే కొంత మంది ప్రముఖ పారిశ్రామికవేత్తల గుంపే 'ది ఎక్స్ పెండబుల్స్'. వీరు దక్షిణ అమెరికాలో తమ వ్యాపారాన్ని ఎలా విస్త్రతం చేస్తారన్నదే ఈ సినిమాలో స్టాలోన్ చూపాడు. ఓ నియంత ఆధీనంలో నడిచే ఈ తతంగాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించాడు. హాలీవుడ్ వెటరన్ యాక్టర్స్ అంతా ఇందులో దర్శనమివ్వబోతున్నారు. అందులో ఒకడు ఆర్నాల్డ్ స్వార్జ్ నెగ్గర్. ఈ చిత్ర కథను రాసుకోవడమేగాక దీనికి దర్శకత్వం వహిస్తుంది కూడా స్టాలినే. ఓ సాహస యాత్రను చూపి ప్రేక్షకుడి నాడీ వేగం పెంచడమే ఈ చిత్రం ముఖ్యోద్దేశమని స్టాలోన్ అంటున్నాడు.


Click it and Unblock the Notifications











