కిడ్నాప్ డ్రామ్ తో మాజీ మెగాస్టర్ మళ్ళీ తెరపైకి..సూపర్ క్రేజ్
హాలీవుడ్ మాజీ మెగా స్టార్ ఆర్నాల్డ్ స్వ్కాజెనెగర్ మళ్లీ సినిమాల్లో రెడీ అవుతున్నారు.'క్రై మాఛో'అనే టైటిల్ తో రూపొందే యాక్షన్ ఫిల్మ్ లో ఆయన నటించబోతున్నట్లు తెలుస్తోంది. కిడ్నాపింగ్ డ్రామాతో ఈ చిత్రం రూపొందనుంది.ఈ చిత్రాన్ని 'ది గాడ్‌ఫాదర్' చిత్రాన్ని నిర్మించిన అల్ రూడీ చిత్రాన్ని నిర్మించనున్నారు.1975లో ఎన్ రిచర్డ్ నాష్ రాసిన ఓ నవల ఆధారంగా ఈ సినిమాకు కథను సిద్ధం చేశారు.'ది లింకన్ లాయర్' చిత్రాన్ని రూపొందించిన బ్రాడ్ ఫర్మాన్ 'క్రై మాఛో'ని రూపొందిస్తారు. భార్యను, బిడ్డను కోల్పోయిన వ్యక్తి పాత్రలో ఆర్నాల్డ్ కనిపిస్తారు. దీంతో పాటు 'లాస్ట్ స్టాండ్' సినిమాలో కూడా ఆయన నటించబోతున్నారు.ఈ వేసవిలో షూటింగ్ పూర్తి చేసి కెన్నాస్ ఫెస్టివల్ కి పంపే ఆలోచనలో ఉన్నారు.అలాగే మే 11 ఈ చిత్రం ప్రారంభం కానుంది.ఈ చిత్రానికి అప్పడే మార్కెట్లో విపరీతమైన క్రేజ్ వచ్చినట్లు నిర్మాతలు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











